టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ తన సంస్థైన వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల తొలి సినిమాలు నిర్మించి వాటితో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. 1999లో మహేష్ హీరోగా తెరకెక్కిన రాజకుమారుడు మూవీని రాఘవేంద్ర రావు తీయగా, ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ విధంగా ఘట్టమనేని వంశ వారసుడిని తన సంస్థ ద్వారా లాంచ్ చేసిన అశ్వినీదత్ ఆ తరువాత మెగా ప్రొడ్యూసర్ మరియు మెగాస్టార్ చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ని కూడా లాంచ్ చేసారు.
అయితే అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ గంగోత్రిని అల్లు అరవింద్ తో పాటు అశ్వినీదత్ కూడా కలిసి నిర్మించారు. ఈ మూవీకి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా కీరవాణి సంగీతం అందించారు. ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, సుమన్, సీత, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు చేయగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ తన ఆకట్టుకునే నటన తో ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు.

2003లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని హీరోగా అల్లు అర్జున్ కి అలానే హీరోయిన్ గా అదితి కి కూడా బాగా పేరు తెచ్చిపెట్టింది. కథ పరంగా పాతదే అయినప్పటికీ కూడా దానిని అప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు రాఘవేంద్ర రావు సఫలం అయ్యారు అనే చెప్పాలి. ఇక ఫస్ట్ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఆ తరువాత సుకుమార్ తో ఆర్య మూవీలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్ దానితో మరింత పెద్ద సక్సెస్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: