సాధారణంగా చాలా మంది నటన మీద ఉన్న మక్కువ కారణంగా తాము చేస్తున్న పెద్దపెద్ద పదవులను కూడా వదులుకొని , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేక ముఖ్యంగా కష్టాలు భరించడం చేతకాక సినిమాల్లోకి వచ్చిన నటులు కూడా ఉన్నారు.. మొదట కొన్ని సంవత్సరాల పాటు వాచ్మెన్ ఉద్యోగం చేసి అక్కడ అవమానాలు ఎన్నో ఎదుర్కొని, నటనలో అయితే గౌరవం ఉంటుంది కదా అన్న ఆలోచనతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇక ఆయనే షియాజీ షిండే..

ముఖ్యంగా ఈయన విలన్ గా, కమెడియన్ గా, ఒక పోలీస్ ఆఫీసర్ గా, తండ్రిగా ఇలా ఏ పాత్రలో నటించినప్పటికీ , ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగల నటుడు అని చెప్పవచ్చు. పుట్టింది మహారాష్ట్ర అయినా,  తెలుగులో ఈయన మాటలతో ప్రేక్షకులను మైమరపింప చేస్తూ ఉంటాడు. తెలుగులో చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఠాగూర్ సినిమా ద్వారా విలన్ గా అడుగుపెట్టిన తర్వాత వీడే, గుడుంబా శంకర్, అతడు, సూపర్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. దేవదాసు, పోకిరి వంటి సినిమాలు షియాజీ షిండే ఇమేజ్ ను మరింత పెంచాయి అని చెప్పవచ్చు.


నిజానికి ఈయన మరాఠీ నటుడు ..అయినప్పటికీ తాను నటించిన తెలుగు సినిమాలలో  95 శాతానికి పైగా ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. మరాఠీ, హిందీ, కన్నడ,  తమిళ్ ,మలయాళం ,గుజరాతి ,ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు. కేవలం బయట ఒక మంచి నటుడిగానే అందరికీ గుర్తింపు కానీ.. ఈయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎవరికీ తెలియదు.. ఈ విషయంపై షియాజీ షిండే ప్రేక్షకులతో పంచుకొన్నాడు. " "నేను మహారాష్ట్రలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాను.. ఏడవ తరగతి వరకు అక్కడే మహారాష్ట్రలో చదివి, పక్క ఊరికి వెళ్లి పదో తరగతి వరకు చదువుకున్నాను.

అయితే ఉన్నత చదువుల కోసం ఒక కాలేజీలో జాయిన్ అయితే, ఫీజు కట్టడానికి డబ్బులు లేక అదే కాలేజీలో రాత్రిపూట మూడు సంవత్సరాలపాటు వాచ్మెన్ గా పనిచేశాను. ఇక 1979 సంవత్సరంలో నటన మీద ఆసక్తితో నాటకరంగం వైపు అడుగులు వేశాను. అలా ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం అన్ని భాషలలో నటుడిగా నటిస్తున్నాను..అని చెప్పండి..ఇప్పుడు  తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: