ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియకు అవకాశాలు తగ్గాయేమో కానీ క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈమె వివాహం అనంతరం సోషల్ మీడియాలో చేస్తున్న సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న శ్రియ సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అటు అగ్రహీరోల తోనూ ఇటు యంగ్ హీరోల తోనూ జతకట్టి వాహ్వా అనిపించింది. అలాంటి స్టార్ డం ఉన్న శ్రియ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వెండి తెరకు కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నారు. భర్తతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ రష్యా లోనే సెటిల్ అయినట్లు సమాచారం. ఇక నటన విషయానికొస్తే ప్రాధాన్యం ఉండే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ సెలెక్టివ్ గా నడుచుకుంటున్నారు.

కానీ  అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్ లో ఉంటూ వారిని అలరిస్తున్నారు. భర్తతో కలిసి దిగే హాట్ ఫోటోలు, వీడియోల జోరు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వివాహం అనంతరం శ్రియ అందాల విందు మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్య సముద్రం మధ్యలో భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి శ్రియ చేసిన సరసాల అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఈ విషయం అటుంచితే ప్రస్తుతం శ్రియ "ఆర్ ఆర్ ఆర్" చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళంలోనూ ఒకటి రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే పలువురు సీనియర్ స్టార్ హీరోయిన్లు ఓ టి టీ వేదిక బాట పట్టగా ఇపుడు శ్రియ కూడా అదే దారిలోనే వెళ్ళడానికి సిద్దమైనట్లు సమాచారం. తాజాగా వెబ్ సిరీస్ ఆఫర్ ఒకటి శ్రియ కు రాగా ఆమె కాన్సెప్ట్ బాగుంది అన్నారు కానీ డెసిషన్ మాత్రం హోల్డ్ లో పెట్టారట. వెబ్ సిరీస్ చేయడానికి శ్రియ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిజంగానే వెబ్ సిరీస్ చేస్తున్నారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: