సినీ పరిశ్రమలో పైకి ఎదగాలి అంటే కష్టపడక తప్పదని తెలుస్తుంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినీ పరిశ్రమలోకి రాకముందు ఎన్నో పనులు చేసి, ఎంతో కష్టపడి ఆ తర్వాత అత్యున్నత స్థానానికి చేరుకున్నారని తెలుస్తుంది..

ఇకపోతే వీరికంటే అత్యంత దారుణమైన కష్టాలని ఎదుర్కొని ప్రస్తుతం అన్ని భాషల లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్నారట షియాజీ షిండే.. అయితే ఈయన సినీ పరిశ్రమలోకి రాక ముందు ముఖ్యంగా చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట.ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడని సమాచారం..

 

షియాజీ షిండే మహారాష్ట్ర లోని ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారని తెలుస్తుంది. వీరి అమ్మ నాన్న కు నలుగురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులట.. అసలే బీద కుటుంబం కావడంతో చదువులకు పెద్ద ఆటంకం కలిగిందని తెలుస్తుంది. షియాజీ షిండే ఏడవ తరగతి వరకు తన ఊరిలోనే చదువుకొన్నాడట. ఆ తరువాత పక్క ఊరికి వెళ్లి పదవ తరగతి పూర్తి చేశాడని తెలుస్తుంది. ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేరాదట. కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉండడంతో, అదే కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ తో మాట్లాడి రాత్రి సమయంలో వాచ్మెన్ గా కూడా పనిచేశాడని సమాచారం.

 

అలా మూడు సంవత్సరాల పాటు పగలు కాలేజీకి వెళ్లడం అలాగే రాత్రి పూట ఆ కాలేజీ కి వాచ్మెన్ గా పనిచేయడం లాంటివి చేశాడని తెలుస్తుంది. అలా వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కట్టి ,చదువులు పూర్తి చేసుకున్నాడని సమాచారం. నటన మీద ఆసక్తితో మొదట నాటక రంగం లోకి అడుగుపెట్టిన ఈయన, ఆ తర్వాత తెలుగులో ఠాగూర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడని సమాచారం. ఇక తర్వాత తన నటనతో తెలుగు, తమిళం, కన్నడ ,మలయాళం, హిందీ, మరాఠీ ,గుజరాతి ,ఇంగ్లీష్ వంటి పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ట్రేడ్ మార్కును క్రియేట్ చేసుకున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: