అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభం లాంటి వాడు మాత్రమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేయించిన ఘనత కూడా ఆయనదే.. ఈయన మొదటి సారి ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి, తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రూపు దిద్దు కున్నాడు.. ఇక 1949 ఫిబ్రవరి 18వ తేదీన అన్నపూర్ణను పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు..


వీరికి ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు.. వారు అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, నాగ సుశీల, సరోజ.. అక్కినేని  నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరు మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి , దీని ద్వారా 1986 వ సంవత్సరంలో వి.మధుసూదనరావు దర్శకత్వంలో విక్రమ్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. అయితే నాగార్జున సుడిగుండాలు అనే సినిమాలో బాలనటుడుగా నటించిన విషయం తెలిసిందే.

ఇక అక్కినేని నాగార్జున ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ రామానాయుడు ను 1984వ సంవత్సరంలో పెద్దల సహకారంలో వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య జన్మించిన తరువాత విభేదాలు రావడంతో 1900 సంవత్సరంలో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత తన సహ నటి అమల ను వివాహం చేసుకున్నాడు. ఒక వీరికి అక్కినేని అఖిల్ జన్మించాడు.


ఇక అక్కినేని నాగచైతన్య సత్య దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన జోష్  సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు . ఇందులో ప్రముఖ హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న అక్కినేని నాగ చైతన్య ,ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.. 2010లో గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన రీమేక్ సినిమామాయ చేసావే లో  సమంత సరసన నటించి, ప్రేమలో పడి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు.

అక్కినేని అఖిల్ కూడా 1995 లో బాలనటుడిగా సిసింద్రీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత 2014లో వచ్చిన మనం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR