టాలీవుడ్ స్టార్ నటి సమంత అక్కినేని ఇటీవల శాకుంతలం మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన విషయం తెల్సిందే. శకుంతల దుశ్యంతుల కథగా ఎంతో భారీ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా దిగ్గజ దర్శకుడు గుణశేఖర్ భారీ వ్యయంతో నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శకుంతల గా సమంత కనిపించనున్నారు. ఇక యువరాణి భరత పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. త్వరలో ఈ మూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి విడుదల చేయనుంది యూనిట్.

ఇక ప్రస్తుతం అటు తమిళ్ లో విజయ్ సేతుపతి తో కలిసి కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తున్నారు సమంత. ఇక ఆమె ఇటు సినిమాలతో పాటు అటు పలు సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మధ్యలో పలు యాడ్స్, అలానే ప్రోగ్రామ్స్ ల షూటింగ్స్ చేస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తన భర్త నాగ చైతన్య తో సమంత త్వరలో విడాకులు తీసుకోనున్నారు అంటూ కొన్ని రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా మీడియాకి దూరంగా ఉంటున్నారు సమంత. ఈ విషయమై ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు ఊహించుకుని రాస్తున్నారని అక్కినేని ఫ్యామిలీ ఒకింత ఆవేదన చెందుతోందని టాలీవుడ్ వర్గాల టాక్.

అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే, లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఒక టాలీవుడ్ స్టార్ నటుడు నటించనున్న బడా ప్రాజక్ట్ లో హీరోయిన్ గా సమంత ఎంపికయ్యారని, నేడు ఆమెకు కథ, కథనాలు వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆ సినిమా యూనిట్, త్వరలో దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: