టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్ విలన్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే ప్రాముఖ్యత ఎక్కువ. ఈ నేపథ్యంలో తెలుగులో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమదైన నటనతో ప్రేక్షకులను ఇంతవరకు అలరిస్తూ వచ్చీ కోట్లాదిమంది అభిమానుల ప్రేమానురాగాలను అందుకున్నారు. ఇక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ప్రేక్షకులను తమ నటనతో ముద్దులు చేశారు. వారిలో ఈ తరం వారు ఎంతగానో అభిమానించే నటి సురేఖ వాణి.

తెలుగు సినిమాలలో అమ్మ పాత్ర దగ్గర నుంచి చెల్లెలు పాత్ర వరకు అన్ని రకాల పాత్రలు పోషించి సీనియర్ నటి గా చలామణి అవుతున్న ఈమె స్టార్ హీరో ల తో కలిసి నటించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కూతురు సుప్రియ తో కలిసి ఆమె అందాల వానను వెదజల్లుతూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరు కలిసి చేసే సందడి కి ప్రేక్షకులు ఎంతో ముగ్డులు అయిపోయారు. 50 ఏళ్ల ప్రాయంలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలో సైతం కొంత అందాలను వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.   

ఇక త్వరలోనే ఈమె కుమార్తె సుప్రియ సినిమాలలోకి రానున్నట్లు వార్తలు వస్తుండగా ఎప్పుడు ఏ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సురేఖవాణి ఇప్పటివరకు నటించిన సినిమాలు చూస్తే ఆమె తన కెరియర్ లో ఎక్కువగా పెద్ద హీరోలతోనే నటించడం విశేషం. 1977వ సంవత్సరంలో జన్మించిన ఈమె తొలుత యాంకర్ గా తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత నటిగా ఇప్పుడు స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు అంటే ముందుగా ఈమే గుర్తొస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: