టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఘోస్ట్'.ఈ మధ్యేనే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను మిత్రబృందం ఖరారు చేసింది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్సినిమా నుండి వైదొలిగినట్టు 'ఘోస్ట్' చిత్ర బృందం మరొక హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ 'ఘోస్ట్' సినిమా నుండి వైదొలగడానికి కారణం.. ఇటీవలే బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్ తొలి శిషువును ఆశిస్తోందని కథనాలు వైరల్ అవుతున్నాయి.

 ఇలా కాజల్ అగర్వాల్ కు ప్రెగ్నెన్సీ రావడం తో ఎంతో కష్టమైన యాక్షన్ సన్నివేశాలలో ఈ సినిమా లో పాల్గొనవలసి రావడంతో ఇది చాలా కష్టతరం అని అనుకున్నా కాజల్ అగర్వాల్ సినిమా నుండి వైదొలగినట్లు తెలుస్తోంది.  దీనితో ఏమీ చేయలేని చిత్ర బృందం వేరే హీరోయిన్ ని వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 'ఘోస్ట్' చిత్ర బృందం పరిశీలనలో ఉన్న హీరోయిన్ల పేర్లలో గోవా బ్యూటీ ఇలియానా, త్రిష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఇప్పటికే నాగార్జున, త్రిష తో నటించి ఉన్నాడు. దానితో చిత్ర బృందం గోవా బ్యూటీ ఇలియానా కే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి చిత్ర బృందం చివరిగా ఎవరికి మొగ్గు చూపుతారో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. మరి అలాగే ప్రస్తుతం కాజల్ అగర్వాల్సినిమా నుండి తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం ఉందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: