బబ్లూ పృథ్వీ రాజ్.. ఈయన భారతీయ నటుడిగా ఒక మంచి గుర్తింపు పొందాడు.. విలన్ గా కొన్ని పాత్రల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన పృధ్విరాజ్, ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషా చిత్రాలలో కూడా తనదైన శైలిలో నటించి, దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించాడు.. 1990వ సంవత్సరం నుండి 2000 సంవత్సరం మధ్యకాలంలో దాదాపు పది సంవత్సరాల పాటు తమిళ టెలివిజన్ సీరియల్స్ లో చాలా విస్తృతంగా పనిచేసి , బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంతేకాదు సినిమా ఆఫర్లు తక్కువ వస్తున్న సమయంలో డాన్స్ రియాల్టీ షో అలాగే జోడి నెంబర్ వన్ లో కూడా గట్టి పోటీ ఇచ్చాడు.. ఈ పోటీ సమయంలోనే ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న శిలంబరసన్ తో తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డాడు. ఇక 2010వ సంవత్సరంలో కూడా టెలివిజన్ పై దృష్టి పెట్టి , రాధిక హీరోయిన్ గా నటించిన వాణి రాణి సీరియల్ లో కూడా ప్రధాన పాత్రలో నటించాడు.. అంతేకాదు బెసెంట్ నగర్ లో  చా రిపబ్లిక్ అనే  ఇక బబుల్ టీ షాపును  కూడా పృథ్వి రాజ్ స్థాపించాడు.


ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 1994వ సంవత్సరంలో బీనా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు . వీరికి 1995 లో అహేడ్ మోహన్ జబ్బర్ అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఇక తెలుగు చిత్రపరిశ్రమకు వస్తే 1974 వ సంవత్సరం లో అమ్మ మనసు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు పృథ్వీరాజ్. ఆ తరువాత 1997వ సంవత్సరంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పెళ్లి. ఈ సినిమాలో విలన్ గా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: