తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన వివాహ బంధం తెగిపోవడం అంటే ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది  సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే.. ఎందుకు తీసుకున్నారు. కారణాలు ఏంటి అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతూ ఉంటారు.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసిన విడాకుల వ్యవహారం ఏది అంటే దర్శకుడు క్రిష్ తీసుకున్న విడాకులు అని చెప్పాలి.  ఎందుకంటే క్రిష్ పెళ్లి సమయంలో ఒక రేంజ్ లో ఆయన అభిరుచులను తెలుపుతూ ఎంతో అద్భుతంగా పెళ్లి పత్రిక ను సిద్ధం చేశాడు.



 ఈ క్రమంలోనే ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు క్రిష్. కానీ రెండేళ్లలోనే ఈ బంధానికి స్వస్తి పలికాడు.  ఇలా క్రిష్ విడాకులు తీసుకోవడం మాత్రం అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో దర్శకుడు క్రిష్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.  పెళ్లి పత్రిక తోనే అందరినీ మంత్రముగ్ధులను చేశాడు క్రిష్. తన సినీ జీవితం గమ్యం చిత్రంతో మొదలైందని..  ఇప్పుడూ తన వ్యక్తిగత జీవితం రమ్య తో ప్రారంభం అవుతుంది అంటూ ప్రాసతో కూడిన కవితలను పెళ్లి పత్రికలో అచ్చు వేయించాడు. కానీ పెళ్ళయిన రెండేళ్ళకే భార్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైపోయారు క్రిష్.



 దీంతో క్రిష్ విడాకులు కాస్త చిత్రసీమకు షాకింగ్ ఇచ్చాయి.  2016 ఆగస్టు 8న డాక్టర్ రమ్య అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు క్రిష్.  ఈ క్రమంలోనే ఎవరి ప్రొఫెషన్లో వాళ్లు ఎంతో బిజీగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి రంగాలు ఎంతో విభిన్నమైన కావడం తో కలిసి జీవించడం కుదరదు అనుకొని విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వీరు చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం వేరే ఉంది అంటూ అప్పట్లో టాక్ వినిపించింది. దర్శకుడు క్రిష్ పెళ్లికి ముందు నుంచి ఒక బాలీవుడ్ భామ తో డేటింగ్ లో ఉన్నాడట. ఇక పెళ్లి తర్వాత కూడా ఆ భామ తో రిలేషన్ షిప్ కట్ చేసుకోకపోవడంతో ఈ విషయం భార్యకు తెలిసి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అంటూ అప్పట్లో వినిపించిన టాక్ ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: