టాలీవుడ్ లో ప్రస్తుతం అనుష్క గురించి పెద్దగా వార్తలు ఏమి రావటం లేదు. అనుష్క సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అనుష్క మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆలోచన ఏంటి అనేది ఇప్పటి వరకు టాలీవుడ్ జనాలకు స్పష్టంగా అర్థం కాలేదు. ప్రస్తుతం అనుష్క పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని కొంతమంది ఆమె గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ అనుష్క మాత్రం తన పెళ్లి గురించి ఎక్కడా స్పందించిన పరిస్థితి లేదు.

త్వరలోనే అనుష్క బాలీవుడ్ లో ఒక భారీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని ఒక ప్రముఖ దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు అని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అనుష్క పెళ్లి అనే వార్తలు మళ్ళీ వినపడుతున్నాయి. ఈ తరుణంలో మరో వార్త కూడా గట్టిగానే వినపడుతుంది. అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పి త్వరలోనే అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యే దానికి సంబంధించి తన కుటుంబ సభ్యులతో కూడా ఆమె చర్చించిందని  అంటున్నారు. అక్కడే స్థిరపడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె వీసా కూడా అప్లై చేసింది అని టాక్. కొన్ని రోజుల పాటు అక్కడే టూరిస్ట్ గా ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తన సినిమా కెరీర్ కి సంబంధించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని మరో ప్రచారం ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారాలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. మరి అనుష్క తన కెరీర్ కి  సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: