రివ్యూ  : 'లవ్ స్టోరి' -  స్లోగా సాగే రెగ్యులర్ బోరింగ్ డ్రామా  !

రేటింగ్ :  2.25   


నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, మరియు  ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని తదితరులు.


డైరెక్టర్  : శేఖర్ కమ్ముల
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్
సంగీత దర్శకుడు: పవన్ సి హెచ్

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు


కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో   అక్కినేని నాగచైతన్య  - క్రేజీ బ్యూటీ సాయి పల్లవి  హీరోహీరోయిన్స్  గా  వచ్చిన  "లవ్ స్టోరి"  సినిమా ఎలా ఉంది ?  అంచనాలను అందుకోగలిగిందా ? లేదా ? అనేది ఈ సినిమా రివ్యూ చూద్దాం.



కథ :

 రేవంత్ (నాగచైతన్య) తక్కువ కులంలో పుడతాడు. చిన్నతనం నుంచి సమాజంలో ఆ కులం తాలూకు అవమానులు బాధలు అనుభవిస్తాడు. ఈ క్రమంలోనే   హైదరాబాద్ లో జుంబా సెంటర్ నడుపుతూ.. దాన్ని డెవలప్ చేసి  లైఫ్ లో ఎదగాలి అనుకుంటాడు.  మరోపక్క రేవంత్   ఇంటి పక్క ఇంట్లోకి  మౌనీ అలియాస్ మౌనిక (సాయిపల్లవి) దిగుతుంది.  జాబ్ కోసం సిటీకి  వస్తోంది.   ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం  ఇద్దరు   ప్రేమలో  పడతారు. కానీ  వారి ప్రేమకు కులం అడ్డు అవుతుంది.  ఆ అడ్డును  దాటుకుని రేవంత్ - మౌనీ ఎలా ఒకటయ్యారు ? ఈ మధ్యలో   ఒకరి కోసం ఒకరు ఏమి చేశారు ? అనేది మిగిలిన కథ.




విశ్లేషణ : 

 
డ్యాన్స్ ట్రైనర్ గా  నాగ చైతన్య  సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.  ఎక్కడా ఓవర్ ఎక్స్  ప్రెషన్స్  ఇవ్వకుండా చైతు తన  పాత్రకు  పూర్తి న్యాయం చేశాడు. పైగా డ్యాన్స్ లో కూడా  చైతు,   సాయి పల్లవితో పోటీ పడ్డాడు. అలాగే     క్లైమాక్స్ లో  చైతు నటన చాలా బాగుంది. 


ఇక   సాయి పల్లవి తన నటనతో పాటు తన అభినయంతోనూ మెప్పించింది.  ఇది ఆమె డ్యాన్స్ లోని గ్రేస్ అయితే  మొత్తం  సినిమాకే మెయిన్  హైలెట్ గా నిలుస్తోంది.  నాగ చైతన్యకి  సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. 

 
విలన్ గా  నటించిన రాజీవ్ కనకాల, తల్లి పాత్రలో  కనిపించిన ఈశ్వరి రావు  తమ  నతనతో ఆకట్టుకున్నారు.  ఇక ఉత్తేజ్, దేవయాని మరియు  మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగా నటించారు.  ఎప్పటిలాగే  శేఖర్ కమ్ముల తన శైలి   కథలో సాధారణ  జీవితాలను  సున్నితమైన ఎమోషన్స్ తో సినిమాని  ఏమోషనల్ గా మలిచాడు.



ప్లస్ పాయింట్స్ :

నాగచైతు నటన, 
సాయి పల్లవి నటన మరియు డ్యాన్స్,
కొన్ని ఎమోషనల్ సీన్స్,
పాటలు, నేపథ్య సంగీతం,    
 


మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,  
స్లో నేరేషన్, 
 రెగ్యులర్ పాయింట్ తో  స్క్రీన్  ప్లే,
బోరింగ్ సన్నివేశాలు,
సినిమా ముగింపు.  

 

తీర్పు :


దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేమకు సంబంధించి ప్రస్తావించిన మెయిన్ పాయింట్, అలాగే  సినిమాలో  పాత్రలు, నేపథ్యం, మరియు మెయిన్   ఎమోషన్స్ బాగున్నాయి. కానీ,  స్లోగా సాగే స్క్రీన్ ప్లే, ఇంట్రెస్ట్ లేని సీన్స్,  రెగ్యులర్ కథ, బలహీనమైన సన్నివేశాలు  వంటి అంశాలు  సినిమా స్థాయిని తగ్గించాయి. మొత్తమ్మీద   ఈ సినిమా నిరాశ పరుస్తోంది.

   

 

మరింత సమాచారం తెలుసుకోండి: