కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ లో ఇప్పటివరకు రీ ఓపెన్ అవ్వలేదు. గత ఏడాది కాలంగా అక్కడ సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని సినీ ప్రేక్షకులతో పాటు ప్రముఖులు సైతం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలను వాయిదా వేశారు. పైగా సినిమా థియేటర్లు ఈ సంవత్సరం కాలంలో ఇంత నష్టపోయారు. అయితే తాజాగా బాలీవుడ్ కు పండగ చేసుకునే న్యూస్ వెల్లడించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇది బాలీవుడ్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సెక్రటేరియట్ నుంచి సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ఓ ప్రకటనను విడుదల చేశారు. బాలీవుడ్ థియేటర్లు అక్టోబర్ 22 నుండి తిరిగి తెరుచుకోనున్నాయి. అశోక్ ఈ వార్త వచ్చినప్పటినుంచి సోషల్ మీడియాలో బాలీవుడ్ తారలతో పాటు వారి అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేటర్ యజమానులు సినిమా హాలు ప్రారంభమయ్యాక ఆరోగ్య నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అలాగే దానికి సంబంధించిన గైడ్ లైన్ లను జారీ చేస్తామని వెల్లడించారు. ఇక బాలీవుడ్ వెండితెర పై వరుసగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.

ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. అందులో రోహిత్ శెట్టి, జయంతి లాల్ గడా వంటి చిత్ర నిర్మాతలు ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ సమస్యలు, థియేటర్లు క్లోజ్ అవ్వడం వల్ల వస్తున్న నష్టాల గురించి చర్చించారు. ఈ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ వార్త వచ్చి రాగానే 'సూర్యవంశీ' సినిమాను దీపావళికి విడుదల చేయబోతున్నాం అంటూ మేకర్స్ ప్రకటించారు. అదే సమయం లో సల్మాన్ ఖాన్ చిత్రం 'యాంటీమ్' కూడా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: