తెలుగు సినిమా పరిశ్రమలో మేల్ కమెడియన్ లు మాత్రమే ఏలుతున్న రోజులలో ఫిమేల్ కమెడియన్లు చాలా తక్కువగా వస్తున్న రోజులలో ప్రేక్షకులను తన ఆహ్లాదకరమైన హాస్యంతో అలరించడానికి తనదైన నటనతో ముందుకు వచ్చింది కోవై సరళ. తెలుగు తమిళ భాషలలో ఆమె నటిస్తూ అతి తక్కువ కాలం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ఇప్పటిదాకా 750 సినిమాల్లో నటించిన ఈమె తమిళనాట ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడుసార్లు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా రెండు నంది ఉత్తమ హాస్య నటి పురస్కారాలు అందుకుంది.

ఇలా నంది అందుకునే రేంజ్ లో నటిస్తూ ఫిమేల్ కమెడీయన్స్ లో నెంబర్ వన్ గా కొనసాగింది. ఆమెకు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే సినిమాలు మంచి పేరును తీసుకువచ్చాయి అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా మలయాళ కన్నడ భాషల్లో కూడా ఆమె నటించింది. ఇంకా నటన తో పాటు కొన్ని సినిమాలలో ఆమె పాటలు కూడా పాడటం విశేషం.  టెలివిజన్ లో సైతం నటించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆమె ఎంతగానో అలరించింది. ఓరి నీ ప్రేమ బంగారం కాను సినిమా బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ,  రాయలసీమ రామన్న చౌదరి సినిమా కి బెస్ట్ ఫిమేల్ కమెడీయన్ గా నంది అవార్డ్ అందుకుంది. 

తమిళనాడులోని కోయంబత్తూరు లో జన్మించిన కోవై సరళ చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలను చూసి నటనపై ఆసక్తి పెంచుకుంది. చదువు పూర్తయిన తరువాత తండ్రి సోదరి ప్రోత్సాహంతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలా ఆమె 9వ తరగతిలో ఉండగానే విజయ కుమార్ కె.ఆర్.విజయ సరసన ఓ సినిమాలో మొదటిసారిగా కనిపించింది. పదవ తరగతి లోనే 32 సంవత్సరాల గర్భిణీ గా నటించింది. ఆ తర్వాత ఆమె టివి ఇండస్ట్రీ కి వెళ్లి అక్కడ మంచి పేరు సంపాదించుకొని సినిమాలలో నటించి స్టార్ గా ఎదిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: