అక్కినేని
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
నాగార్జున ద్విపాత్రాభినయం లో నటించగా ఆయనకు భారీ హిట్ చిత్రంగా ఇది నిలవగా ఇది ఆయన కెరీర్ లోనే భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. 2016 లో
నాగార్జున అతి పెద్ద
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ
సినిమా కు సీక్వెల్ గా ఇప్పుడు బంగార్రాజు అనే
సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కూడా
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం.
కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ
సినిమా సోగ్గాడే చిన్ని నాయన
సినిమా లాగానే సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని హంగులను దాని కంటే ఏ మాత్రం తక్కువ గా ఉండకుండా చూసుకుంటున్నారు యూనిట్. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం అనసూయ, హంసా నందిని వంటి అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కూడా టైటిల్ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చేయనున్నారట. దానికోసం ముగ్గురు ముద్దుగుమ్మలు
నాగార్జున ఇప్పటికే సెలెక్ట్ చేశాడు అని చెబుతున్నారు.
రంభ
ఊర్వశి మేనక అంటూ సాగే ఈ పాట ముగ్గురు అప్సరసలతో కలిసి బంగార్రాజు చిందులు వేయనున్నాడట. ఈ సినిమాలో
నాగచైతన్య కూడా మరో
హీరో పాత్ర చేస్తున్నాడు. ఈయన సరసన కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తూండగా
నాగార్జున నాగచైతన్య కలిసి ముచ్చటగా మూడో సారి నటించబోతున్నారు. నాకు తెలిసిన
రమ్యకృష్ణ నటిస్తూ ఉండగా ఈ టైటిల్ సాంగ్ లో
రంభ గా
వేదిక ఊర్వశిగా మీనాక్షి దీక్షిత్ మేనక గా
బెంగాలీ భామ దర్శనం దర్శనం ఇవ్వబోతున్నారట. ఇక ఇటీవలే
లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న
నాగచైతన్య ఈ చిత్రంలో ఎంతో హుషారుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అటు
నాగార్జున కూడా ఘోస్ట్ అనే చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.