టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పూరి జగన్నాథ్ కు ఎంతో మంచి పేరు ఉంది. బద్రి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలను తెరకెక్కించాడు. ఎవరకి సాధ్యం కాని విధంగా అత్యంత విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన పూరి జగన్నాథ్ 2019 సంవత్సరంలో విడుదలైన నేనింతే సినిమాకి గాను ఆయనకు నంది పురస్కారం లభించింది. ఆయన తెరకెక్కించిన సినిమాలలో బద్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మ నాన్నతమిళ అమ్మాయి శివమణి పోకిరి చిరుత నేనింతే బిజినెస్ మాన్ శంకర్ సినిమాలు విజయవంతం అయ్యాయి.

అయితే యావరేజ్ హిట్ గా నిలిచినా నేనింతే సినిమా కి ఆయనకు నంది అవార్డు రావడం విశేషం.. సినిమా వారి జీవన విశేషాలు, కష్టాలు ఈ చిత్రం లో చూపించగా కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందుకే ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను మెప్పించింది.. అలాగే సినిమా వారిని కూడా ఎంతో అలరించింది. ఇక ఆయన దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించి మంచి అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నాడు. అలాగే యువ దర్శకులను ప్రోత్సహిస్తూ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. 

హిందీలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ త కలిసి బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా ను చేసిన పూరి ఇతర సినిమా పరిశ్రమలలో కూడా  పెద్ద హీరోలతో సినిమా చేసి అన్ని భాషలలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఉత్తమ మాటల రచయిత నాన్నతమిళ అమ్మాయి సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. అమ్మా నాన్న ల మధ్య అనుబంధాన్ని తెలుపుతూ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ని సెంటిమెంట్ చిత్రానికే హైలైట్ గా నిలిచింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: