టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దగ్గుబాటి వారసుడు గా లీడర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని హీరోగా సెటిలైపోయాడు రానా. ఆ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేయగా బాహుబలి సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో చేసింది ప్రతినాయకుడి పాత్ర అయినా ఆయనకు గొప్ప పేరు తీసుకు వచ్చింది ఈ సినిమా. ఓ వైపు  సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలు ప్రత్యేక పాత్రలు పోషించి అన్ని భాషలలో మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా వివాదాలలోకి వెళ్ళలేదు కానీ ఆయన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది ఓ వివాదం అదే త్రిషతో ప్రేమాయణం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా గొప్ప గొప్ప సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకున్న త్రిష రాణాతో ప్రేమాయణం నడిపింది అనే వార్త అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది. పెద్ద హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈమె రానాతో కలిసి ఏ సినిమాలో చేయకపోయినా కూడా పలు పార్టీల లో ఫంక్షన్ లలో వీరిద్దరూ కలుసుకుని అక్కడ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. 

అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోలేక పోయారని లేదంటే తప్పకుండా పెళ్లి చేసుకునే వారని
 అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏదైతేనేం చివరికి ఈ సమస్య ముగిసిపోయింది. త్రిష ఆ తర్వాత సినిమాలు చేయడం ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోయి దానిని మధ్యలోనే క్యాన్సల్ చేసుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు వీరి కలయిక గురించి వార్తలు రావటం లేదు కానీ ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది అభిమానుల వాదన మరో వైపు నడుస్తుంది. ఓ వైపు త్రిష వరుస సినిమాలు చేస్తుంటే మరో వైపు రానా పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: