మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో చిరంజీవి ఆచార్య అనే మాజీ నక్సలైట్ గా కనిపించనుండగా ఆయన క్రింద పని చేసే అనుచరుడిగా సిద్ద అనే పాత్రలో చరణ్ కూడా కనిపించనున్నట్లు టాక్. యువ కథానాయికలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈ భారీ మూవీని మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా దర్శకడు కొరటాల ఎంతో గ్రాండ్ గా తీస్తున్నారట.

ఇటీవల చరణ్ ఈ సినిమాలో పాత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఇందులో చిరంజీవి, చరణ్ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయట. ఈ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం ఆచార్య తో పాటు మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ కూడా చేస్తున్నారు చరణ్. ఇక త్వరలో ప్రముఖ కోలీవుడ్ దర్శకడు శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల లాంచ్ కాగా దీని అఫీషియల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న పాత్ర లో తళుక్కున మెరవనున్నట్లు టాక్. గతంలో శంకర్ తో మెగాస్టార్ ఒక సినిమా చేయాలని భావించారు అయితే అది ఇప్పటివరకు కుదరలేదు. కాగా ఈ సినిమాలోని ఆ స్పెషల్ రోల్ మీరు చేస్తే బాగుంటుందని శంకర్ చెప్పడంతో మెగాస్టార్ కూడా ఓకె అనేసారట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: