చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కుష్బూ ఆ తర్వాత సౌత్ లో మంచి నటిగా నిరూపించుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన జోడీ కట్టి నెంబర్ వన్ రేసులో నిలిచింది. అప్పట్లో ఆమెకు ప్రేక్షక లోకం నీరాజనం పట్టింది. ఆమె నటనకు ఫిదా అయ్యి ఎంతో మంది అభిమానులు గా మారారు. సౌత్ లో సినిమాలు చేస్తూ మహారాష్ట్ర నుంచి చెన్నైకి మకాం మార్చిన తర్వాత ఖుష్బూ ఇక్కడే స్థిరపడిపోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోల సరసన జోడి కట్టిన ఖుష్బూ అప్పట్లో ఎంతో మందికి కలల రాణి. అయితే ఆమె మాత్రం మరో తమిళ హీరోపై మనసు పారేసుకుంది. అయితే అతను కూడా మరో స్టార్ హీరో తనయుడు కావడం విశేషం.

విషయంలోకి వస్తే తమిళ నటుడు ప్రభు, ఖుష్బూ కాంబినేషన్లో అప్పట్లో సినిమాలు వచ్చాయి. వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆ తర్వాత నిజంగానే ప్రేమలో పడింది. 1991లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ చిన్న తంబి సినిమా చేస్తున్నప్పుడు ఖుష్బూ ప్రభుత్వ డేటింగ్ చేసింది. వీరిద్దరూ నాలుగున్నర ఏళ్లు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే కుష్బూ ప్రేమకు ప్రభు తండ్రి శివాజీ గణేషన్ విలన్ గా మారాడు. అలా ఖుష్బూతో ప్రేమాయణానికి తండ్రి శివాజీ గణేషన్ నో చెప్పడంతో ఆయన కూడా వెనక్కి తగ్గాడు. మొత్తానికి ఒకప్పటి తమిళ లెజెండ్, నటుడు శివాజీ గణేషన్ కొడుకు రియల్ లైఫ్ లవ్ లో విలన్ అయ్యాడు. దీంతో ప్రభుతో ప్రేమకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
2000 ఖుష్బూ ప్రముఖ దర్శక నిర్మాత సి సుందర్ ని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె తన పేరును ఖుష్బూ తొందరగా మార్చుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత.

మరింత సమాచారం తెలుసుకోండి: