ఏపీ ప్రభుత్వం ఆదాయం అన్వేషించే మార్గాల్లో పడింది. మామూలుగా ఏ ప్రభుత్వాలైన అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టించుకోవాలని చూస్తుంటుంది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజలపై పన్నుల భారం వేసి ఆదాయం రాబట్టాలని అనుకుంటుంది. గత రెండు ఏళ్లుగా ప్రభుత్వం అదే పనిచేస్తుంది. ప్రతి దానిపై ట్యాక్స్ పెంచి ప్రజలపై అదనపు భారం వేసింది. పెట్రోల్, డీజిల్, గృహ నిర్మాణానికి సంబంధించిన వాటిపై విపరీతంగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది. ఇక వైన్స్‌లో చెప్పాల్సిన పని లేదు. కరెంట్, ఆర్‌టి‌సి ఛార్జీలు పెంచింది. చెత్త మీద పన్ను, టాయిలేట్ మీద పన్ను....అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఏంటి ప్రతి దాని మీద పన్ను వేసుకుంటూ, ఆదాయాన్ని రాబట్టే కార్యక్రమం చేస్తుంది.

అలాగే తాజాగా గతంలో ప్రభుత్వాలు...పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకోవాలని వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరిట రూ. 10, రూ. 20 వేలు వసూలు చేయడానికి సిద్ధమైంది. ఇక సినిమా టికెట్లు, మటన్ షాపులు కూడా నడుపుతామని చెబుతోంది. అయితే ఎప్పుడో 2015లో వచ్చిన బాహుబలి చిత్రానికి సంబంధించిన పన్నుల వాటా ప్రభుత్వానికి సరిగ్గా రాలేదని, అందులో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ చేస్తామని చెబుతోంది.

బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్‌ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసిందని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సీట్లు ఫుల్ అయినా సరే సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపించారని, ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందని, ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సజ్జల గారు సెలవిచ్చారు.

ఇక గ‌తంలో ఇదే వైసీపీ వాళ్లు రాజ‌మౌళి అమ‌రావ‌తి నిర్మాణానికి గ్రాఫిక్స్ ఇస్తారా ?  బాహుబ‌లి స్టైల్లో సెట్లు వేస్తారా ? అని కూడా ఆయ‌న్ను టార్గెట్ చేశారు. మ‌రి ఇప్పుడు బాహుబ‌లిని లాగ‌డం వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేయాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: