మన తెలుగులో స్నేహ విషయంలో కొంత మంది స్టార్ హీరోలు ఆమెకు కీలకపాత్రలు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనే ప్రచారం ఉంది. అయితే కొన్ని సినిమాల్లో ఆమె నటించిన తర్వాత ఫ్లాప్ కావడం ఇబ్బంది పెడుతున్న పరిణామం. ఈ నేపథ్యంలోనే స్నేహ విషయంలో మన టాలీవుడ్ జనాల ఆలోచన మారింది అనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు స్నేహ విషయంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని సమాచారం. రామ్ చరణ్ తన సినిమాల్లో స్నేహను అమ్మగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడని టాక్ ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో తాను చేసే సినిమాకు గాను స్నేహను అమ్మగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ కొరటాల శివ సినిమాలో కూడా స్నేహ అత్త పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలో మహేష్ బాబు కి ఆమె అక్క గా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే స్నేహ ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలను చేస్తున్నారు. కన్నడంలో కూడా ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నట్టుగా వార్తలు ఉన్నాయి.

ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఈ పరిణామం ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు చెల్లించే పరిస్థితి లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా అడుగు వేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది మాజీ హీరోయిన్లు పెద్ద పెద్ద పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసి అందుబాటులో ఉండే వాళ్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: