ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన రీమేక్ ల జోరు చాలా బాగా నడుస్తుంది, ఏదైనా భాషలో ఒక సినిమా మంచి హిట్ సాధించి, జనాల ఆదరణ పొందిందంటే ఆ సినిమాను మరొక భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టాలని దర్శక నిర్మాతలతో సహా హీరోలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఇప్పటికే మన తెలుగులో మంచి విజయాలను సాధించిన సినిమాలను బాలీవుడ్ లో రీమిక్ చేసి మంచి విజయాలను అందుకున్న వారు చాలానే  మంది ఉన్నారు , అలాగే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే, ఆ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు, ఈ సినిమా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఇలా తెలుగు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగులో విజయం సాధించిన జెర్సీ సినిమాలను కూడా హిందీలో తెరకెక్కిస్తున్నాడు, ఈ సినిమాకు కూడా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు ,అయితే తాజాగా షాహిద్ కపూర్సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు, సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో  షాహిద్ కపూర్ ని ఒక అభిమాని నాని గురించి ఒక మాటలో చెప్పండి అని అడిగాడు, అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జెర్సీ సినిమా లో నాని చాలా అద్భుతంగా నటించాడు, నాని నటన చూసి నాకు ఏడుపు వచ్చింది, నిజానికి ఈ సినిమాను చేసేందుకు నాని నటనే నాకు స్పూర్తి ని ఇచ్చింది. అంటూ షాహిద్ కపూర్ తన సోషల్ మీడియా వేదిక గా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: