అందాల ముద్దుగుమ్మ కాజల్ కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో కాజల్ తన అందంతో, అభినయంతో, హవా భావాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది, ఆ తర్వాత చందమామ సినిమా లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన మగధీర సినిమా లో హీరోయిన్ గా నటించి తెలుగులో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే ప్రముఖ వ్యాపార వేత్త అయిన గౌతమ్ కిచ్లు ను ప్రేమించి పెళ్ళాడింది. 

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా తన భర్త అంగీకారంతో అప్పటి వరకు అంగీకరించిన సినిమా లను పూర్తి చేస్తూ వస్తోంది, అందులో భాగంగా చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను కూడా కాజల్ అగర్వాల్ పూర్తి చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సమయం లోనే కాజల్ అగర్వాల్ పై లెక్కలేనన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కు ప్రెగ్నెన్సీ వచ్చిందని, ఆమె  ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంటుంది అని వార్తలు కూడా వచ్చాయి.

 మరి ముఖ్యంగా నాగార్జున హీరోగా తెలుగు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, అయితే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుండి వైదొలగింది అంటూ అనేక వార్తలు వచ్చాయి, మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చిత్రబృందం ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించ లేదు. ఇలా ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా కాజల్ అగర్వాల్ పై అనవసరంగా లెక్క లేనన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: