గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో ఆయన చేసిన ప్రసంగం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. ఆయన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేయడం ఒక్కసారిగా ఈ ప్రకంపనలు మొదలు కావడానికి కారణాలు అయ్యాయి. వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడానికి కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ల రేట్లు విషయమై సినిమా వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు జగన్.

నైజాం లో ఉండే టికెట్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉండటం వల్ల సినిమా పరిశ్రమ కు భారీ నష్టం వాటిల్లుతుందని సినిమా వారు భావించి అక్కడ టికెట్ రేట్లను పెంచాల్సి జగన్ కు వినతిపత్రం అందించారు.  అయితే దాన్ని పట్టించుకోని ఈ విధంగా జగన్ వ్యవహరిస్తూ ఉండటంతో ఆయనను కలవాలని కొంతమంది సినీ పెద్దలు అనుకొగా వారికి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం అనే విషయం వారిని మరింత ఆగ్రహం పరుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో రాజకీయ నాయకుడిగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేదికపై ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేసి సినిమా పరిశ్రమకు మేలు చేయబోయాడు. 

ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు నటుడు రచయిత పోసాని కృష్ణమురళి గట్టి సమాధానం ఇవ్వగా ఇప్పుడు ఆయనపై విమర్శల వర్షం కురుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరెంజ్ లో ఇంత వరకు ఎవరు కూడా బహిరంగంగా తిట్ట లేదనే చెప్పాలి. అయితే తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో పవర్ లేనివాడికి పవర్ స్టార్ అనే పేరు బిరుదు ఎందుకు అని చెప్పాడు. అంతే కాదు తన రాబోయే సినిమాలో పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఉండకూడదు అని సదరు దర్శక నిర్మాతలకు సూచించాడు. ఈ నేపథ్యంలో ఆయన పవర్ స్టార్ అనే బిరుదును ఇకపై స్క్రీన్ పై చూడలేము. అయితే ఇది ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.  పవర్ స్టార్ లేని పవన్ కళ్యాణ్ పేరు వారికి ఏవిధంగా రుచిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: