యువహీరో శర్వానంద్, హీరోయిన్ మెహ్రీన్, మారుతి డైరెక్షన్లో వచ్చిన చిత్రం"మహానుభావుడు". ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించాడు. 2017 వ సంవత్సరం సెప్టెంబర్ 29న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. భారీ అంచనాల మధ్య లో విడుదలై, స్టార్ హీరోల సినిమాకు పోటీగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది ఈ చిత్రం. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ కాగా ఈ హీరో సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

ఇక స్పైడర్ లాంటి సినిమాకి పోటీగా వచ్చి తనదైన శైలిలో కలెక్షన్లను రాబట్టింది మహానుభావుడు సినిమా. అయితే ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం.

1). నైజాం-6.1 కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-2.81 కోట్ల రూపాయలు.
3). సీడెడ్-2.56 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-1.10 కోట్ల రూపాయలు.
5). ఈస్ట్-1.70 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.88 కోట్ల రూపాయలు.
7). నెల్లూరు-59 లక్షలు.
8). కృష్ణ-1.63 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..18.28 కోట్ల రూపాయలను కలెక్షన్లు రాబట్టింది.

9). రెస్టాఫ్ ఇండియా-2.60 కోట్ల రూపాయలు.
10). ఓవర్సీస్-2.10 కోట్ల రూపాయలు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు చూస్తే..22.98 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా 21.7 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసేసరికి..22.98 కోట్ల రూపాయలను షేర్ని రాబట్టింది. అంటే బయ్యర్లకు దాదాపుగా..1.28 కోట్ల రూపాయలు లాభం తెచ్చింద నమాట. ఇక 2017 సంవత్సరానికిగాను ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మహానుభావుడు చిత్రం ముందు రాధా అనే సినిమాతో డిజాస్టర్ లో ఉన్న శర్వానంద్ కు మహానుభావుడు సినిమా మళ్లీ హిట్ ట్రాక్ లోకి తెచ్చిందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా తరువాత శర్వానంద్ ఇప్పటివరకు మరొక హిట్ ను సొంతం చేసుకోలేక పోయాడు. ఏదిఏమైనా మహానుభావుడు అంటూనే ప్రేక్షకులను బాగా నవ్వించాడు  శర్వానంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: