ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ప్రభుదేవాకు ఈ మధ్య కాలంలో క్రేజ్ తగ్గిన విషయం అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన రాధే సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలతో బిజీ అయిన ప్రభుదేవా తెలుగులో మరో సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలని భావిస్తున్నారని సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి జోరు చూపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆచార్య షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని సమాచారం.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటు చిరంజీవి భోళాశంకర్ సినిమాలో మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారని ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్స్ చూస్తే అర్ధమవుతుంది. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరంజీవితో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్న డైరెక్టర్లలో సంపత్ నంది మరియు ప్రభుదేవా ఉన్నారని వార్త వినిపిస్తుంది. చిరంజీవి హీరోగా ప్రభుదేవా డైరెక్షన్ లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని సమాచారం. కానీ ఆ సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు అప్పట్లో భారీ క్రేజ్ వచ్చిందని సమాచారం.

ఈ కాంబినేషన్ లో కనుక సినిమా నిజంగా వస్తుందో లేదో తెలియాల్సి ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావాలంటే కనీసం ఒక సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరంజీవి తరువాత సినిమాల గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందని సమాచారం. చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది చిరంజీవి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: