సాధారణంగా చాలామంది నటీనటులు మొదట సినీ ఇండస్ట్రీలో నటించి, ఆ తర్వాత తమ సెకండ్ ఇన్నింగ్స్ ను బుల్లితెరపై మొదలు పెడుతూ ఉంటారు.కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం బుల్లి తెరపై తన నటనను మొదలుపెట్టి , వెండితెరపై స్టార్ హీరో గా, మోస్ట్ వాంటెడ్ హీరోగా కూడా గుర్తింపు పొందుతున్నారు.. ఆయన ఎవరో కాదు శాండిల్వుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన యష్.. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్ .. 1986 వ సంవత్సరం జనవరి 8వ తేదీన కర్ణాటకలోలోని హసన్ జిల్లాలో ఉన్న భువన హళ్లి గ్రామంలో జన్మించాడు. ఇక ఈయన తండ్రి అరుణ్ కుమార్. జే... కె ఎస్ ఆర్ టి సి రవాణా సేవ కు సంబంధించి బి ఎమ్ టి సి లో ఒక బస్ డ్రైవర్ గా పని చేస్తున్నారు.. తల్లి పుష్ప గృహిణి. ఒక సోదరి కూడా ఉంది.. ఆమె పేరు నందిని. విద్యాభ్యాస విషయానికి వస్తే మహాజన ఎడ్యుకేషన్ సొసైటీ లో puc పూర్తి చేశాడు.

మొదటిసారి నాటక రచయిత బీ వీ కరాంత్  రూపొందించిన బెనకా నాటక బృందం లో చేరాడు. నటన నేర్చుకొని మొదటిసారి ఈటీవీ కన్నడ లో ప్రసారం అయిన నందగోకులం టీవీ సీరియల్ ద్వారా మొదటిసారి బుల్లితెరపై అడుగులు వేశాడు.. తర్వాత నాలుగు సంవత్సరాల పాటు టెలీ సీరియల్స్ లో పనిచేసి, ఆ తర్వాత 2008లో శశాంక్ దర్శకత్వం వహించిన ముగ్గిన మనసు అనే సినిమాలో సహాయక పాత్రలో నటించాడు. అయితే అంతకు ముందు జంబడ హుడిగి  అనే పాత్రలో నటించినప్పటికీ , పెద్దగా గుర్తింపు లేదు. తదుపరి చిత్రం 2008లో వచ్చిన రాఖీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరో గా అడుగు పెట్టాడు..


ఈ సినిమాతో గుర్తింపు పొందడంతో ప్రస్తుతం ఆయనను అందరూ రాఖీ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇక 2014 లో వచ్చిన గూగ్లీ సినిమాతో ఉత్తమ నటుడిగా కన్నడ ఫిలిం ఫేర్ అవార్డు తోపాటు సైమా అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ , 2019లో కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమాలో నటించి ఉత్తమ నటుడిగా రెండు సైమా అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కే జి ఎఫ్ టు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు..అతి  తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులలో ఒకరిగా గుర్తింపు పొందడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: