టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇటీవలే కాలంలో యంగ్ హీరోలు తమ సత్తా చాటుతూ స్టార్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. కొంత మంది స్టార్ హీరోలు మూస ధోరణిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బోరు కొట్టిస్తున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో యంగ్ హీరోలు మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు అనే వాదన కూడా ఇంకొక వైపు వినిపిస్తుంది. కొన్ని సినిమాలు స్టార్ హీరోలు చేయడానికి పనికిరావు. చిన్న హీరోలు చేస్తేనే వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలకు తమ ఇమేజ్ అడ్డు వస్తుంది.

ఆ విధంగా యంగ్ హీరోలు మంచి మంచి చిత్రాలను చేసి హిట్ సంపాదిస్తుంటారు. తమపై ఎలాంటి ఇమేజ్ లేదు కాబట్టి వారు ఎలాంటి కాన్సెప్ట్ అయినా ఎంచుకునే అవకాశం ఉండడం వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ విధంగా ఇప్పటి తరం హీరోలలో మంచి మంచి కాన్సెప్ట్ లతో దూసుకుపోతున్నారు హీరో సంతోష్ శోభన్. ఇటీవలే ఏక్ మినీ కథ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి ప్రేక్షకులలో కళ్ళలో పడ్డ ఈ హీరో అంతకుముందు కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా వాటిలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు.

అంతే కాదు ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లి ఏ యంగ్ హీరో లేనంత బిజీగా మారిపోయాడు సంతోష్. వర్షం, బాబీ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ తనయుడిగా సంతోష్ హీరో గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకోగా ఇప్పుడు తనదైన నటన తో ప్రేక్షకులలో స్థిరపడే విధంగా తన కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ హీరోకి ప్రభాస్ లాంటి హీరో సపోర్ట్ ఉండడం కూడా ఆయనకు ఎంతగానో ప్లస్ అవుతుంది. మరి భవిష్యత్తులో ఈ హీరో ఎలాంటి సంచలనం కలిగించే సినిమాలను తెరకెక్కిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: