టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు సుకుమార్ సినిమాలు అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రేక్షకులలో ఉంది. ఆయన సినిమాలు మంచి ఇంటలిజెన్స్ తో పాటు మంచి కథ కథనం ఆలోచింపజేసే మాటలు కూడా ఉంటాయి. ప్రతి పాత్ర ద్వారా ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెల్లే టాలీవుడ్ దర్శకులలో సుక్కు కూడా ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు 80 శాతం సక్సెస్ అయ్యాయి అంటే ఆయన తన చిత్రాన్ని ఏవిధంగా చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన ఏ సినిమా కూడా భారీగా ఫ్లాప్ అవ్వలేదు. కనీసం యావరేజ్ గా అయినా ఆయన సినిమాలు నిలిచిపోతాయి.

ఆ విధంగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా మొదటిసారి డి గ్లామర్ రోల్ చేస్తున్నాడు బన్నీ. లారీ డ్రైవర్ గా ఆయన ఈ చిత్రంలో కనిపిస్తూ ఉండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆమధ్య టీజర్ విడుదల కాగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు ఇది పెద్ద అవకాశం గా చెప్పుకోవాలి. హీరోయిన్ పాత్రలను ఎంతో అందంగా తీర్చిదిద్దడమే కాకుండా సినిమాలో మంచి ప్రాధాన్యత ను ఏర్పాటు చేసి సుకుమార్ ఈ సినిమాలో కూడా రష్మిక మందన పాత్రను చాలా బాగా రాశాడట.

ఆ విధంగా ఆమెకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే ఈ లుక్ విడుదల చేయగా దానికి సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన దక్కుతుంది. ఆమె పోస్టర్ చాలా బాగుందని ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో మాత్రమే ఆమెను చూడగా మొదటిసారి మంచి పాత్రలో ఆమెను చూడబోతున్నామని ఆమె అభిమానులు సైతం చెబుతున్నారు. ఏదేమైనా ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ గా చేయడం మాత్రమే కాకుండా రష్మిక ఓ అద్భుతమైన పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్ కు ప్లస్సవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రష్మిక డీగ్లామర్ పాత్ర చేస్తుండగా తాను చేయబోయే కొత్త సినిమాలలో కూడా తనకు మంచి ప్రాధాన్యత ఉండే విధంగా ఆమె ప్రణాళికలు వేసుకుంటుంది.  ఆమె బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమా లు చేస్తుంది. ఇటీవలే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: