టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో కలెక్షన్ల సునామీ సృష్టించి మిడ్ నైట్ స్టార్ గా వెలుగులోకి వచ్చాడు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ మొదటి సినిమా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఇతనితో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి సినిమా ప్రయత్నాలు చేసే వారు. కాళ్లు అరిగేలా తిరిగినా ఏళ్లు గడుస్తున్నా ఒక్క అవకాశం కూడా రాలేదు. అలాంటిది నేడు టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఉన్నాడంటే అతడి టాలెంట్, నిబద్దత దానికి తోడు కొంత అదృష్టం కలిసి రావడమేనని చెప్పొచ్చు. ఇతడు స్క్రీన్ పై నటిస్తాడు అనడం కన్నా జీవిస్తాడు అంటే బాగుంటుందేమో! అంతగా సహజమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే అట్రాక్ట్ చేసేస్తాడు ఈ నవ యువ నటుడు.

ఆ తర్వాత రవిబాబు "నువ్విలా" సినిమాలో ఓ చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు విజయ్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన "పెళ్లిచూపులు" చిత్రంతో సోలో హీరోగా పరిచయమయి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్క సారిగా స్టార్ హీరోగా ఎవరురూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. నిజానికి మొదట ఈ సినిమా కథను సందీప్ వంగ మొదట అల్లు అర్జున్ కు చెప్పాడు. కానీ ఆయన నో చెప్పడంతో మరో ఇద్దరు స్టార్ హీరోలకు కూడా ఈ కథ వినిపించాడట, అయినా ఎవరూ ఒప్పుకోకపోవడంతో విజయ్ దేవరకొండపై ఉన్న నమ్మకంతో అతనికి చెప్పాడు.

వీరు మంచి ఫ్రెండ్స్ కావడంతో సందీప్ పై నమ్మకం ఉంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. అయితే ఒకేసారి ఈ హీరో నాలుగు చిత్రాలతో బిజీ అయిపోయాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగింది. నేడు పాన్ ఇండియా హీరో స్థాయికి కూడా చేరుకున్నాడు విజయ్. ఒకవేళ విజయ్ దేవరకొండసినిమా చేయకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్ర్మముఖులు అనుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: