డైరెక్టర్ దేవా కట్ట .. ఈ మధ్యకాలంలో ఎక్కువగా  తన పేరును బాగా పాపులర్ చేసుకున్నాడు. ఈయన చేసిన ఒకే ఒక్క సినిమా డైనమిక్. ఇక ఈ సినిమా తమిళం నుంచి తెలుగులోకి తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఎందుకు ఆకట్టుకోలేదు అనే విషయంపై ఆయన ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి అన్నట్లుగా తెలియజేశాడు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.


డైనమిక్ సినిమా మంచు విష్ణు కెరీర్లో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా గురించి డైరెక్టర్ దేవకట్టా తమిళం నుంచి "అరీమ నంబి కి" పేరుతో తెలుగులో డైనమిక్ గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి దేవా కట్ట కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పని చేసినట్లుగా తెలియజేశాడు. ఇక ఆ తరువాత ఎవరికి కావలసిన విధంగా వారు ఆ సినిమాని తీసుకున్నారు అన్నట్లుగా తెలియజేశారు దేవా కట్ట. ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాయి అన్నట్లుగా తెలియజేశాడు.

ఇక అప్పుడు ఇప్పటికి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా జె.డి.చక్రవర్తి పాత్రలో ఈ రూమర్లు బాగా వినిపించాయి అన్నట్లుగా తెలియజేశాడు. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు దాటిపోతున్నా.. ఇప్పుడు దేవాకట్ట మళ్ళీ తిరిగి ఈ సినిమా గురించి ప్రస్తావించడం తో ఈ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది. ఇక డైరెక్టర్ దేవకట్టా ఈ సినిమాని కేవలం తొమ్మిది రోజులే పని చేస్తే.. ఇక మిగిలిన రోజులన్నీ ఆ సినిమాకి ఎవరు తీశారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం.


ఇక ఈయన ఇలా చెప్పడంతో సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆయన నిజంగానే ఒక డైనమిక్ లాంటి వార్త పేల్చాడు అన్నట్లుగా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మిగిలిన భాగం ఎవరు తీశారు అనే విషయంపై ఇంకా ప్రేక్షకులకు అర్థం కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: