జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ హీరో నవీన్ 100 పర్సంట్ తన పాత్రకు న్యాయం చేశాడు అన్న ఫీలింగ్  కలిగే ఉంటుంది. నవీన్ కి  ఇండస్ట్రీకి రాక ముందు బీటెక్ అయిపోగానే లండన్ లో జాబ్ మంచి జీతం లక్సరి లైఫ్ ఉండేది. అయినా అతడికి అవేమీ సంతృప్తి ఇవ్వలేదు. దాంతో కొన్నాళ్ళకి ఆ జాబ్ కి రిజైన్ చేసి బెంగళూర్ వచ్చి యాక్టింగ్ స్కూల్లో చేరాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సినిమాలంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. అలా మొదట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఒక చిన్న అవకాశం దొరికింది. 

ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు పాకెట్ మనీ కోసం నాటకాలు కూడా వేసేవారట. అది కూడా ఒక్కో నాటకానికి 700 రూపాయలు మాత్రమే వచ్చేది. ఆ డబ్బులు సరిపోక సేల్స్ మెన్ గా కూడా చేశారట నవీన్. ఇండియన్ మ్యారేజ్ మీద సెటైరికల్ గా ఉండే హానెస్ట్ వెడ్డింగ్ అనే ఒక ఎపిసోడ్ చేయగా అందులో నవీన్ పోలిశెట్టి కూడా నటించాడు. అది నవీన్ కి కాస్త గుర్తింపు తెచ్చి పెట్టింది. అలా దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని అందుకుని ముందుకు సాగాడు. ఆ తర్వాత స్వరూప ఆర్ ఎస్ జే డైరెక్షన్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాతో తన టాలెంట్ ఏమిటో వెండి తెరపై కనబరిచి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు.

సినిమా తర్వాత బాలీవుడ్ నుండి అవకాశం తలుపు తట్టింది అలా "చిచోరే" చిత్రంలో మంచి పాత్రను పోషించాడు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమా కూడా అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో అక్కడ గొప్ప గుర్తింపు లభించింది. ఇక ఇండస్ట్రీలో నవీన్ పోలిశెట్టి కి విజయ్ దేవరకొండ మంచి స్నేహితుడు అన్న విషయం  తెలిసిందే. థియేటర్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే  ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ ప్రమోషన్ లో విజయ్ కూడా బాగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: