గంగూ భాయ్  జనవరి 6 న వస్తోంది !

మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 నిబంధనలకు సడలింపులు ఇస్తోంది. ఆ రాష్ట్రంలో  అక్టోబర్ నుంచి థియేటర్లు తెరచుకోనున్నాయి. దీంతో నిర్మాతలు  తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు తేధీలను ఖరారు చేసుకుంటున్నారు. విఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చిత్రం 'గంగూభాయ్ కటియావాడి' చిత్రం జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో నటుజడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీ ఎంతో పేరు గడించారు. ఫిల్మ్  ఇన్ స్టిట్యూట్ పూర్వ విద్యార్ధికి దేశ విదేశాల్లో చాలా మంది అభిమానులున్నారు.  ఆయన గతంలో తీసిన 'దేవదాస్' చిత్రం  బాలీవుడ్ చరిత్రను తిరగరాసిందనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. 2002 సంవత్సరంలో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా చరిత్ర కెక్కింది. దేశీయంగానే  కాక విదేశీ పత్రికలు సైతం సంజయ్ లీలా బన్సాలీ చిత్రాలను మెచ్చుకున్నాయి. బాలీవుడ్ ప్రముఖలు అమితాబచ్చన్, షారూఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, తదితరులు ఎందోరో ఈయన చిత్రాలలో నటించారు. మరేంతో మంది ఈయన చిత్రాలలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రముఖ నటి ఆలియాభట్ 'గంగూభాయ్ కటియావాడి' చిత్రంలో ఓ వేశ్య పాత్రను పోషిస్తుండటం విశేషం. హుస్సేన్ జైదీ రచించిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సంజయ్ లీలా బన్సాలీ. ఇందులో ఆలియా భట్ ఓ వేశ్యగా, మాఫియా రాణిగా విభిన్న మైన పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఏడాది జూన్ లో ఈ చిత్రం పూర్తి కావలసి ఉన్నా, యూనిట్ సిబ్బంది కరోనా బారిన పడటంతో చిత్ర నిర్మాణం ఆలస్యమైంది. అన్ని అడ్డంకులను అధికమించి జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియాభట్, రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తున్నదని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారననే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపధ్యంలా ఈ చిత్రం విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: