IHG

భారత దేశంలో అత్యంత ప్రభావవంతమైన గాయకుల్లో మన తెలుగు వారు ముందుంటారు వారిలో ఎస్ జానకి గారు ఒకరు. ఆమె పాడితే కోకిల పలికే తీయని గాత్రం లా ఉంటుందంటారు అంతా. అందుకేనేమో అందరూ ఆమెను గాన కోకిల అంటారు. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్ట్లా జానకి, ఈమె గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా లో ని పళ్లపట్ల అనే గ్రామం లో జన్మించారు. ఈమె తండ్రి గారు ఒక ఆయుర్వేద వైద్యుడు. ఈమె చిన్నప్పటి నుంచి పాటలు పడటమంటే మక్కువ ఎక్కువ. ఎస్ జానకి గారు నటి నటుల హావభావాలకనుగుణంగా తన గాత్రాన్ని అందిస్తారని అంటారు .


ఆమె కేవలం గాయని మాత్రమే కాదు గేయ రచయిత కూడా. ఈ విషం చాల తక్కువమందికి మాత్రమే తెలుసు .ఆమె తమిళ చిత్రం విధియిన్ విలయట్టులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను 1957 లో ప్రారంభించింది. జానకమ్మ మన తెలుగు వారు కావడం మన కు గర్వ కారణం. ఆమె ఇప్పటివరకు 50,000 లకు పైగా పాటలు పాడారంటే అతి సయోక్తి కాదేమో , దాదాపుగా ఆమె అన్ని ఇండియన్ భాషల్లో తన గాత్రాన్ని వినిపించారు. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల భాషల్లో కూడా పాటలు పాడారు.IHG


"నీలి మేఘాలలో" బావ మరదల్లు (1961), పదహారేళ్ల వయసు నుండి "సిరిమల్లెపూవా", సప్తపది నుండి నెమలికి నేర్పిన అనే పాట,భైరవ ద్వీపం లో నరుడా ఓ నరుడా అనే పాట..మొదలగునవి ప్రజాధారణ పొందాయి , ఈమె ప్రతిభకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నారామె, అయితే 2013 లో ఆమెకు భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారు. అందుకు కారణం దక్షిణ భారతదేశం లోని కళాకారుల ను ప్రభుత్వం గుర్తించకపోవడమే. ఈ సందర్భం తరువాత ఒక్కసారిగా యావత్ భారత దేశం సౌత్ సినిమా వైపు చూసింది. ఏదేమైనప్పటికీ జానకమ్మ మీకు శిరసాభి వందనం.


మరింత సమాచారం తెలుసుకోండి: