సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే అధ్యక్షత పదవి కోసం పోటీ చేస్తున్న సభ్యులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్,మంచు విష్ణు తప్పనిసరిగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉండగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం లేదనే విషయంలో అగ్ర హీరోల పొరపాటు అస్సలు లేదని పేర్కొన్నారు శివాజీ రాజా.

ఇండ్రస్టీ లో ఎవరి సమస్యలు వారికి ఉంటాయని..ఎవరైనా వెళ్లి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ కావాలని అడిగితే స్టార్ హీరోలు అందరూ కూడా ముందుకు వస్తారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.అమెరికాలో ఈవెంట్ చేద్దామని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు వచ్చారని..ఇక మహేష్ బాబు గారిని ఈవెంట్ గురించి కలిస్తే..నమ్రత ఎంతో గౌరవంగా మీ ఇష్టం సార్, మీరు ఎలా చెబితే అలా చేద్దామని అన్నారని శివాజీ రాజా వెల్లడించారు.ఇక తాను, నటుడు బెనర్జీ ఇద్దరూ కలిసి ప్రభాస్ దగ్గరికి వెళ్తే..ఈవెంట్ చేయడం వల్ల ఎంత వస్తుందో చెప్పమని అన్నారని..అయితే తాను అమౌంట్ చెప్పగా తాను బిజీగా ఉన్నానని...

 అయితే ఆ అమౌంట్ ను తాను ఇస్తానని ప్రభాస్ చెప్పారని..  ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు శివాజీ రాజా.టాలీవుడ్ లో మంచి మనస్సు ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారని.స్టార్ హీరోలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పడం నూటికి నూరు శాతం తప్పు అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి, స్టార్ హీరోల గురించి శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారాయి.ఆఅయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం కోసం స్టార్ హీరోలు సైతం డబ్బులు ఇవ్వడానికి సిద్ధం అయినప్పుడు... ఇప్పటివరకు మా భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: