వెండి తెర వేదిక పై గాంధీ సందేశం

జాతి పిత మహాత్మా గాంధీని తలవని సినీ  రచయిత ఉన్నాడా  ?  సామాన్యుడిగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగిన మోహన్ దాస్ కరమ్  చంద్  గాంధీ బో ధించిన విలువలు, ఆయన ప్రభోధాలు,  సర్వ జనావళి కోసం ఆయన చేసిన కృషి  ఎంతో మంది సినీ రచయితలకు స్పూర్తి.  గాంధీజీ  సందేశాన్ని వెండి తెర  వేదికగా తమ కలాలను కదిలించా రెందరో కవులు.
 భారత దేశానికి స్వాతంత్య్రం 1947 లో వస్తే, అంతకంటే మందే వచ్చిన చిత్ర గీతాలలో గాందీజీని  స్తుతించారు  తెలుగు సినీ రచయితలు. గాంధీజీ, రాట్నానికి  విడతీయరాని అనుబంధం. ఆ అనుబంధాన్ని తన ఆక్షరాలలో కూర్చి,  అభిషేకించిన రచయిత శంకరంబాడి సుందరాచారి. 1941 లో గాంధీజీ జీవనమే నేపథ్యంగా  తీసిన ఓ డాక్యుమెంటరీలో 'పాడవే రాట్నమా... ప్రణవ భారత గీతి'  అనే పాటను రాశారు. తెలుగు సినీ ప్రస్థానంలో చెప్పుకో తగ్గ చిత్రం 'మనదేశం'.  ఆ సినిమాలో సీనియర్ సముద్రాల తన కలం నుంచి సుధలు కురిపించారు. .... 'గాంధీ జవహర్ పటేలు గారూ /మహారథలు, మన నేతలు రా... అంటూ   దేశం కోసం పోరాడిన జాతీయ నేతలను, వారి స్పూర్తిని  వెండితెరవేదికపై  వినిపించారు. సీనియర్ సముద్రాల రాసిన సినీ గీతాలలో గాంధీజీ  ప్రస్తావన కొంచెం ఎక్కువే. 'దొంగ రాముడు' చిత్రంలో ...'భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ' పాట నేటి తరం లోనూ  స్పూర్తిని నింపుతోంది. 'కులమత భేదం వలదన్నాడు...కలిసి  బతికితేనే బలమన్నాడు.... మానవులంతా ఒకటన్నాడు'  అంటూ గాంధీజీ సిద్దాంతాలను చిట్టి పొట్టి మాటలతో చెప్పేశారాయన. అంతే కాదు 'మానవ ధర్మం బోధించాడు...మనిషై ఇలలో వెలిశాడు' అంటూ  జాతిపిత బోధనలను  జనావళికి  తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
మనసు కవిగా పేరొందిన సినీ కవి ఆత్రేయ 'బడి పంతులు'  సినిమాలో ...'శాతిదూతగా వెలసిన మన బాపూజి' అని కొనియాడారు. ... 'భారత మాతకు జేజేలు... బంగరు భూమికి  జేజేలు' అని జేజేలు పలికారు. 'నేనూ నా దేశం' చిత్రంలో సినీ రచయిన అంకితశ్రీ తన దైన స్వరం వినిపించారు.  'కుల మత భేదం మాపిన త్యాగి..అమర  బాపూజీ వెలసి దేశం' అంటూ భరత భూమికి నమస్కరించారు.
జ్ఞానపీఠ్ అవార్జు గ్రహీత  సి. నారాయణ రెడ్డి.... 'నీ ధర్మం,.. నీ సంఘం,. నీ దేశం నీవు మరువ వద్దు' అంటూ జాతి పిత గాంధీ ప్రబోదించిన నీతిని ""కోడలు దిద్దిన కాపురం" సినిమా చక్కగా గుర్తు చేశారు. "అమెరికా అబ్బాయి"  సినిమా లో సి. నారాయణ రెడ్డి  'గాంధీ చూపిన మార్గాన్ని మరువద్దంటూ' యువతకు దశానిర్దేశం చేశారు.
విప్లవ కవ  శ్రీరంగం శ్రీనివాసరావు .... అదే నండీ శ్రీ శ్రీ తాను రాసిన  సినీ గీతాలలో జాతి పితను స్తుతించారు. ఆయన కలలు గన్న రాజ్యం కోసం  ఎదురు చూశారు.  దానినే తన పాటలలో కూర్చారు.  'దేశ సంపద పెరిగే రోజు... మనిషి మనిషిగా బ్రతికే రోజు.. గాంధీజీ కలలు గన్న రోజూ' అంటూ  ఓ పాటలో రాశారు..  'ఉందీ లే మంచి కాలం ముందు ముందునా'.. అంటూ "దొంగరాముడు" చిత్రంలో శ్రీ శ్రీ రాసిన ఈ పాట దశాబ్దాలుగా జనబాహుళ్యంలో అజరామరమైంది.... ఇలా  రాసుకుంటూ పోతే ఎందరెందరో కవులు  బాపూజీ నుంచి స్పూర్తి పొందారు.  ఆయనకు తన గీతాలతో అక్షరార్చన చేశారు. తన జీవన యానంలో ఎలాంటి పదవులూ కోరని మహాత్ముడు గాంధీజీ

మరింత సమాచారం తెలుసుకోండి: