'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'తో మల్టీస్టారర్‌ ట్రెండ్‌కి బూస్టప్‌ ఇచ్చిన హీరో వెంకటేశ్. అక్కడ మహేశ్‌ బాబుతో కలిసి బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన వెంకీ ఆ తర్వాత యంగ్‌హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి 'ఎఫ్2'  సినిమా చేశాడు. ఈ మూవీ కూడా సూపర్‌ హిట్ అయ్యింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్‌గా 'ఎఫ్3' అనే సినిమా చేస్తున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది 'ట్రిపుల్ ఆర్'. హిస్టారికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో వస్తోన్న ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇక జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నాడు. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తున్నారనే టాక్‌తో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినీయర్లు, స్టార్ మేకర్స్‌ అనే ఫార్ములాని పక్కనపెట్టి యువ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే మరో హీరోతోనూ కలిసి సినిమా చేస్తున్నాడు. 'ఆచార్య'లో రామ్‌ చరణ్‌ కీ-రోల్ ప్లే చేస్తోంటే, తర్వాత బాబీ దర్శక్వంలో వచ్చే సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

రానా ఎక్కువగా సర్‌ప్రైజింగ్‌ ప్యాకేజెస్‌తోనే వస్తుంటాడు. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఇలా డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తోన్న రానా నెక్ట్స్‌ ఒక మల్టీస్టారర్‌కి సైన్ చేశాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో శర్వానంద్‌, రానా హీరోలుగా ఒక సినిమా తెరకెక్కబోతోందట. ఇక ఈ మూవీతో ఒక కొత్త దర్శకుడు పరిచయం అవుతాడనే ప్రచారం జరుగుతోంది. రానా ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో కలిసి 'భీమ్లానాయక్' అనే మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. రీసెంట్‌గా వచ్చిన రానా టీజర్‌కి క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ని చాలెంజ్ చేసే క్యారెక్టర్‌ని ఫెంటాస్టిక్‌గా ప్లే చేశాడనే ప్రశంసలు వస్తున్నాయి.

మల్టీస్టారర్ అనగానే ఆటోమెటిక్‌గా సినిమాపై బజ్‌ మొదలవుతుంది. దీంతో మంచి బిజినెస్‌ కూడా జరుగుతుంది. అలాగే హీరోలిద్దరి అభిమానులు థియేటర్‌కి వస్తే వసూళ్ల వేగం కూడా పెరుగుతుంది. అందుకే నిర్మాతలు కూడా మల్టీస్టారర్స్‌కి రెడీ అంటున్నారు. ఇక స్టార్లు కూడా ఎగ్జైటింగ్‌గా ఉంటుందని మల్టీస్టారర్స్ చేస్తున్నారు. మొత్తానికి మల్టీస్టారర్ చిత్రాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: