పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితులు కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్య ఒక సారి ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది, కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల వల్ల ఇంకా కొన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాక కావడం, మరియు ఆంధ్రప్రదేశ్ లో 100% ఆక్యుపెన్సీ మరియు టికెట్ రేట్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను దసరాకు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాను ప్రస్తుతం దసరాకు విడుదల చేసే పరిస్థితులు లేకపోవడంతో మరో అనువైన తేదీ కోసం చిత్రబృందం ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 100% ఆక్యుపెన్సీ మరియు టికెట్ రేట్ల విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉండడం, అలాగే మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా థియేటర్లు మరికొన్ని రోజులు పూర్తిస్థాయిలో ఓపెన్ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి కూడా తెలుగులో స్టార్ హీరోలు అయిన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమా, పవన్ కళ్యాణ్, రానా లు హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలు ఇప్పటికే తమ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు విడుదల తేదీలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ సినిమా కు జనవరి 7,8 తేదీలు అనుకూలంగా ఉన్నట్లు కొంతమంది తెలియజేస్తున్నారు. మరి ఈ తేదీలలో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేస్తారా, లేక మరింత అనువైన తేదీ కోసం చిత్రబృందం వేచి చూస్తారా, తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: