ఈ మ‌ధ్య కాలంలో కామెడీ షో ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు బాగానే ఆధ‌రిస్తున్నారు. మొట్ట మొద‌టి సారిగా 2013 లో మ‌ల్లె మాల ప్రొడ‌క్ష‌న్ లో జ‌బ‌ర్ధ‌స్త్ అనే కామెడీ షో ఈ టీ వీ లో టెలికాస్ట్ అయింది. అప్ప‌టి నుంచి దాదాపు 400 పైగా ఎపిసోడు ల‌ను టెలికాస్ట్ చేశారు. ఈ కామెడీ షో ఆలోచ‌న విజ‌య వంతం కావ‌డం తో మిగిలిన ఛాన‌ల్స్ వారు కూడా ఇలాంటి త‌ర‌హ లోనే కామెడీ షో ల‌ను నిర్వ‌హిస్తున్నారు. దాదాపు అన్ని కామెడీ షో లు కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇలాంటి కామెడీ షో ల‌తో చాలా మంది న‌టీ న‌టులు సినిమా రంగానికి ప‌రిచ‌యం అవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కామెడీయ‌న్స్ సినిమాల‌లో ఎంపిక అవుతున్నారు.



అయితే ఈ షో ల‌లో మొద‌ట కేవ‌లం కామెడీ కే ప్రాధాన్య‌త ఇచ్చే వారు. కానీ కొన్ని రోజుల త‌ర్వా కామెడీ తో పాటు కాంట్ర‌వ‌ర్సీ చేశావేరు. అలాగే ప్ర‌స్తుతం కామెడీ, కాంట్ర‌వ‌ర్సీ ల‌తో పాటు ల‌వ్ ట్రాక్ లు కూడా న‌డుస్తున్నాయి. అయితే ఈ ల‌వ్ ట్రాక్ లు నిజ‌మేనా లేదా వారి షో ల‌కు వారి ఛాన‌ల్స్ కు టీఆర్పీ రేటింగ్స్ రావ‌డానికి ఇలా యాక్టింగ్ చేస్తున్నారా అనేది మాత్రం తెలియ‌క ప్రేక్ష‌కులు తిక మక అవుతున్నారు. అయితే జ‌బ‌ర్థ‌స్ కామెడీ షో లో మొద‌ట ఈ ప్ర‌యోగం సుడిగాలి సుధీర్, యాంక‌ర్ ర‌ష్మీ ల‌పై ప్ర‌యోగించారు. ప్ర‌తి ఎపిసోడ్ లో వీరి మ‌ధ్య ఎదో ఉంద అనే విధంగా చేశేవారు. కానీ అది అంతా కామెడీ పండించ‌డానికే అలా చేస్తున్నామ‌ని సుధీర్‌, రష్మీ విడి విడిగా చాలా వేదిక‌ల‌లో చెప్పారు. అలాగే హైప‌ర్ ఆది, అనుసూయ మ‌ధ్య కూడా ల‌వ్ న‌డుస్తోంద‌ని పుకార్లు వ‌చ్చాయి. అవ‌న్నీ కూడా వ‌ట్టి పుకార్లే న‌ని వారు కూడా తెల్చి చెప్పారు.  అలాగే ఇదే షో లో హ‌ర్ష‌, ఇమ్మానయెల్ ల మ‌ధ్య కూడా ల‌వ్ న‌డుస్తోంద‌ని అని అన్నారు.



తాజాగా మ‌రి కొంద‌రి పై కూడా ఇలాంటి పుకార్లు వ‌స్తున్నాయి. ఇదే జ‌బ‌ర్ధ‌స్త్ షో లో  రాకింగ్ రాకేష్‌, బిగ్ బాస్ ఫేం రోహిణిల మ‌ధ్య ల‌వ్ న‌డుస్తోంద‌ని అని అంటున్నారు. ఈ మ‌ధ్య ఒక ఎపిసోడ్ లో కూడా రాకేష్ రోహిణి కి ప్ర‌పెజ్ చేశాడు. దీంతో వీరి మ‌ధ్య కూడా ల‌వ్ న‌డుస్తోంద‌ని పుకార్లు  వ‌స్తున్నాయి. అలాగే జీ తెలుగు లో వ‌చ్చే కామెడీ స్టార్స్ లో కూడా హ‌రి అశు రెడ్డి ల మ‌ధ్య కూడా ప్రేమ ఉంద‌ని అంటున్నారు. దానికి బ‌లం చేకురేలా వారు కూడా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే హ‌రికి అశు రెడ్డి ఒక స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్టు ఒక ఎపిసోడ్ లో చూపించారు. దీంతో వీరి మ‌ధ్య గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తోంద‌నే పుకార్లకు బ‌లం చేకురుంది. అయితే ఇలాంటి జిమ్మిక్కులు త‌మ షో ల‌కు ఛాన‌ల్ ల‌కు టీఆర్పీ రేటింగ్స్ పెర‌గాల‌నే ఇలా చేస్తుంటార‌ని ప‌లువురు వ్యాఖ్య నిస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య కామెడీ షో ల లో పుట్టుకు వ‌స్తున్న ల‌వ్ స్టోరీలో ఎటు వైపు వెళ్తాయో చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: