ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష న్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి నుంచి వ‌చ్చిన బాహుబ‌లి - ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత ఆయ‌న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ ఆర్ ఆర్ ను తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో ఇద్ద‌రు యంగ్ స్టార్ హీరోల కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా కావడంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం యావ‌త్ దే శ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ యేడాదిన్న‌ర కాలంగా క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా ప‌లు మార్లు షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కూడా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతోంది. వ‌చ్చే సంక్రాంతికి అయినా ఈ సినిమా వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో అయితే ప్రేక్ష‌కులు ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా మ‌రో ఆర్ ఆర్ ఆర్ వ‌స్తోంది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అయిపోయారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ ప్ర‌భుత్వం, జ‌గ‌న్ పై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తోన్న ఆయ‌న మ‌రో బాంబు పేల్చారు. తాను తీసే ఆర్ ఆర్ ఆర్ 2024 ఎన్నికల నాటికి రిలీజ్ చేస్తానంటున్నారు ఈ ఎంపీ. ఈ మేరకు కథా చర్చలు, సంప్రదింపులు ప్రారంభించినట్టు కూడా ఆయ‌న చెప్పారు. ఏపీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ పరిస్థితు ల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఉంద‌న్న ఆయ‌న .. తా ను ప్ర‌స్తుతం వైసీపీ లో ఉన్నందున ఆ సినిమా తీయ‌లేనని. తాను వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకే ఆ సినిమా తీస్తాన‌ని చెప్పారు.

ఇప్ప‌టికే సినిమా వాళ్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నందున దీనిపై కొద్ది రోజుల లో క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. కొంద‌రు స్క్రిఫ్ట్ ల‌తో స‌హా త‌న‌ను క‌లిశార‌ని.. అవి కాకుండా నా మైండ్ లో వేరే స్క్రిప్టు ఉందని కూడా వాళ్లతో చెప్పాన‌ని.. ఆ టైమ్ వస్తే తప్పకుండా సినిమా తీస్తాన‌ని ఆర్ ఆర్ ఆర్ చెప్పారు. 2024 ఎన్నిక‌ల నాటికి ఆ సినిమా రిలీజ్ ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక చంద్ర‌బాబు బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే మంచిద‌ని కూడా ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR