మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ఎప్పుడో పూర్తి చేసినా కూడా ఇంకా విడుదల చేయకపోవడం అభిమానులను ఎంతగానో నిరాశకు గురి చేస్తుంది.  ఓవైపు కరోనా సమస్య వల్ల థియేటర్లకు ప్రేక్షకులు పూర్తిస్థాయిలో రాకపోవడం, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల విషయంలో సందిగ్ధత నెలకొనడం వంటివి ఈ సినిమా విడుదల కాకపోవడానికి ముఖ్య కారణాలు. భారీ బడ్జెట్ తో ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను విడుదల చేస్తే తక్కువ లాభలే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

దాంతో ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయక పోవడమే మంచిదని భావించి చిరంజీవి సినిమా వాయిదా వేస్తూ వచ్చాడు. తాజాగా కొన్ని పెద్ద పెద్ద చిత్రాలు తమ సినిమాలను విడుదల చేసేందుకు మంచి ముహూర్తాలు పెట్టుకున్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన తీసుకు రాబోతున్నాడు.  అలాగే సంక్రాంతి కానుకగా కొన్ని పెద్ద సినిమాలు ఇప్పటికే విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్నాయి.

దసరా స్లాట్ కూడా ఖాళీగా లేదు మహాసముద్రం మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమాలు దసరా కు రానున్నాయి.  ఈ నేపథ్యంలో ఎక్కడ ఖాళీ లేకపోవడంతో ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్న ఆందోళన ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు. చిరంజీవి ఈ సమస్యను పట్టించుకోకపోవడం వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల ఇంకా ఎన్ని రోజులు అనేది చూడాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్చరణ్ కీలక పాత్ర పోషించగా పూజా హెగ్డే మరియు కాజల్ లు హీరోయిన్లుగా నటించారు.  మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా లో మెగాస్టార్ కనీసం ముప్పై నిమిషాలకు పైగా కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: