సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన హీరోయిన్ ని తన సినిమాలో తీసుకునేందుకు అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ కూడా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో సినిమా విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అనే టాక్ ఉంది. కేరళ మార్కెట్ పెంచుకోవడానికి అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నాలు చేయడమే కాకుండా అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమాలో కేరళలో కూడా షూటింగ్ చేసే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.
తిరువనంతపురంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అలాగే అక్కడున్న పర్యాటక ప్రదేశాల్లో కొన్ని పాటలను కూడా చిత్రీకరించి సినిమాకు క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అలాగే పాటల విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాటలను కూడా రచిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు కేరళలో ప్రభావం చూపిస్తుంది ఏంటనేది చూడాలి. ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.