కొంగర జగ్గయ్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, రచయితగా, రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు, గంభీరమైన కంఠానికి, వాక్చాతుర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ నటులు అతడిని కంచు కంఠం జగ్గయ్య అని, కళావాచస్పతిగా బిరుదు ఇచ్చారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు... పాత్రికేయుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తలు చదివిన వ్యక్తి పేరుపొందారు. కొంగర జగ్గయ్య అనేక సినిమాలు, నాటకాలల్లో నటించారు. ఆంధ్రులకు జగ్గయ్యగా సుపరిచిత వ్యక్తి.

కొంగర జగ్గయ్య వాయిస్ ఎంతో యూనిక్‌గా ఉంటుంది. మేఘాలు గర్జించినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో.. అతని మాటలు కూడా అంతే గంభీరత్వాన్ని కలిగి ఉంటాయి. జగ్గయ్యకు 1992లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. కొంగర జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గర్లోని దుగ్గిరాల సమీపాన ఉన్న మోరంపూడి గ్రామానికి చెందిన వారు. 1928 డిసెంబర్ 31వ తేదీన ధనిక కుటుంబంలో జన్మించారు. జగ్గయ్యకు నాటకాల మీద మక్కువ ఎక్కువ. అందుకే చిన్నతనం నుంచే నాటకాల్లో రాణించారు. తన 11వ ఏటా రామాయణంలో లవుడి వేశం వేశారు. ప్రముఖ బెంగాలీ రచయిత ద్విజేంద్ర లాల్‌రాయ్ రాసిన సీత అనే హిందీ నాటకంలో లవుడి వేశం వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

జగ్గయ్య రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవారు. చదువుకునేప్పుడు కాంగ్రెస్ సోషలిస్టు గ్రూపులో తెనాలి నుంచి సెక్రటరీగా ఉన్నారు.ఇంటర్మీడియట్ తర్వాత ‘దేశాభివృద్ధి’ అనే పత్రికకు ఉప సంపాదకుడిగా పని చేశారు. దీని తర్వాత ‘ఆంధ్రా రిపబ్లిక్’ అనే ఇంగ్లీష్ వార్తా పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకునేటప్పుడు నట సామ్రాట్ నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరు ఎన్నో నాటకాలు, సినిమాల్లో నటించారు. జగ్గయ్యకు వరుసగా మూడేళ్లపాటు ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా లభించింది. ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ జగ్గయ్య చెరగని ముద్రను వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: