తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలకు భారీగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాల విషయంలో పునరాలోచనలో పడ్డారనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు చేసే విషయంలో ఇప్పుడు టాలీవుడ్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది అని అంటున్నారు. కొంతమంది టాలీవుడ్ అగ్రహీరోలు కొన్ని సినిమాలకు సంబంధించి చాలా వరకు కూడా నిర్మాతలను ఒత్తిడి చేయడం లేదని అంటున్నారు. అయితే ప్రభాస్ విషయంలో మాత్రం ఇదే అలా జరగటం లేదు అనేది కొంతమంది చెప్తున్న మాట.

 ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి బాహుబలి సినిమా తరువాత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నిర్మాతల తో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. అంతవరకు బాగానే ఉంది గాని ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకునే విషయంలో మాత్రం ఎక్కడా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రతి సినిమాకు దాదాపు 60 నుంచి 70 కోట్లకుపైగా తీసుకుంటున్నాడని దీంతో నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయాలంటే భయపడుతున్నారు అని అంటున్నారు.

బాలీవుడ్ లో కూడా ప్రభాస్ క్రేజ్ పెరుగుతుందన్న నేపథ్యంలో అతని సినిమాలకు సంబంధించి నిర్మాతల్లో స్పష్టత రావడం లేదు. తెలుగులో ఒకప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించిన చాలామంది స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు ఇప్పుడు ప్రభాస్ బడ్జెట్ చూసి భయపడి పోతున్నారు. భవిష్యత్తులో ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. బాలీవుడ్ దర్శకులతో పాటు కన్నడ దర్శకులతో కూడా ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడని అయితే రెమ్యునరేషన్ కాస్త తగ్గించి ఉంటే మాత్రం తెలుగులో సినిమాలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. కానీ బాలీవుడ్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: