తెలుగు సినిమా పరిశ్రమలో 1960 మరియు 1970 దశకంలో స్టార్ హీరోయిన్ రాణించిన నటీమణి వాణిశ్రీ.  రత్నకుమారి గా ఆమె చిన్నతనం నుంచి పెరగగా సినిమా లోకి రాగానే వాణిశ్రీ గా పేరు మార్చుకుంది ఈమె. తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల లో మరపురాని ముద్రను వేసుకుంది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్ర తో మంచి పేరు తెచ్చుకున్న నటి గా సెట్ అయ్యింది.

ఈ సినిమాలో ఇది మల్లెల వేళయని అనే పాట తో ఈమె మరింత ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు కథానాయికగా నటించగా ఆమెకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1970వ దశకమంతా ఈమె స్టార్ హీరోయిన్ గా నిలిచింది అంటే ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అర్థం చేసుకోవచ్చు. 80వ దశకం చివరిలో శ్రీదేవి మరియు జయప్రద వంటివారు వచ్చినా కూడా వారందరికంటే ఎక్కువ ఆదరణ పాపులారిటీ సాధించి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.  సినిమాలలో నటించిన తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిర పడిపోయింది.

ఈమెకు ఓ కొడుకు కూతురు ఉన్నారు.  80వ దశకములో ఈమె తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. హీరో అత్త పాత్రలో, తల్లి పాత్ర లలో నటించి మరొకసారి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. నాది ఆడజన్మే అనే సినిమా కోసం ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఎస్వీ రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాటకాల అంటే ఎంతో ఇష్టం ఉన్న వాణిశ్రీ అప్పట్లో ప్రజాదరణ పొందిన రక్తకన్నీరు నాటకం లో కథానాయకుడి భార్యగా, చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మ గా నటించి నాటక ప్రియులను అలరించి వారి అభిమానాన్ని పొందింది. ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హణనూరు ఆమెను తన సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: