ఒక సమయంలో టాలీవుడ్ ని ఒక ఊపు ఉపేసిన హీరోయిన్స్ లో త్రిష ఒకరు. మెగాస్టార్ నుంచి సిద్దార్ధ దాకా అందరి హీరోస్ తో నటించి సూపర్ హిట్స్ కొట్టింది. 2002 నుంచి 2007 వరకు ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత మెల్లగా త్రిష కి తెలుగులో ఆఫర్స్ రావడం తగ్గాయి. ఆ సమయంలోనే ఆమె తమిళ్ మీద ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా కొన్ని హిట్స్ వచిన్నప్పటికి అది కూడా ఎక్కువ కాలం ఆమె కెరియర్ ని నిలబెట్టలేదు.

యంగ్ హీరోలతో ఛాన్సులు తగ్గగానే ఆమె మెల్లగా పెద్ద వయసు ఉన్న హీరోలతో నటించడం మొదలుపెట్టింది. అలా త్రిష రజినీకాంత్ తో పెట్ట , బాలకృష్ణ తో లయన్ లాంటి సినిమాల్లో నటించింది.ఆమెకి ఈమధ్య కాలంలో బాగా పెరు తెచ్చిన సినిమా 96. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె నటనకి అవార్డ్స్ రివార్డ్స్ చాలానే వచ్చాయి. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన త్రిష కి ఆ సినిమాలు ఏవి అంత గొప్ప హిట్స్ ఇవ్వలేదు. ఇక త్రిష వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు అయిన కూడా ఇంతవరకు ఆమె పెళ్లి మాట ఎక్కడ వినపడలేదు. ఒకప్పుడు త్రిష కి రానా కి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అనే రూమర్స్ ఒక రేంజ్ కో వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవం అని రానా ప్రకటించారు.

ఇక త్రిషకి చాలా నచ్చిన నటుడు పవన్ కళ్యాణ్. ఈ విషయం ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వీరి ఇద్దరు కలిసి తీన్మార్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ త్రిష మొదటి సారి లిప్ లాక్ సీన్ లో నటించారు. ఇక త్రిష ప్రస్తుతం మణిరత్నం భారీ బడ్జెట్ తో దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న పొంనియం సెల్వన్ లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: