‘పుష్ప’ తన రిలీజ్ డేట్ ను డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 17కు మార్చుకోవడంతో చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ అవకాశాలకు దెబ్బ పడినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి టిక్కెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి సంబంధించి వచ్చే నెలాఖరి లోపు ఇండస్ట్రీకి మేలు చేసే విధంగా ఒక నిర్ణయం ఉంటుందని అందరు భావిస్తున్నారు.



ఈ అంచనాలకు అనుగుణంగా డిసెంబర్ జనవరి నెలలలో విడుదల అయ్యే భారీ సినిమాల డేట్స్ వరసగా ప్రకటిస్తున్నారు. ఈ లిస్టులో ‘ఆచార్య’ కూడ ఉండాలని భావించి డిసెంబర్ మొదటి వారంలో కాని లేకుంటే డిసెంబర్ రెండవ వారంలో కానీ ‘ఆచార్య’ మూవీని విడుదల చేయాలని ఆలోచనలు చేసారు. అయితే ఇప్పుడు ‘పుష్ప’ తన రిలీజ్ డేట్ ను ముందుకు జరుపుకుని డిసెంబర్ 17కు విడుదల అవ్వడం ‘ఆచార్య’ టీమ్ కు ఊహించని షాక్ గా మారింది అంటున్నారు.



దీనితో ఈ విషయంలో అల్లు అర్జున్ తో రాయబారాలు చేయాలని కొరటాల శివ భావిస్తున్నప్పటికీ దానివల్ల ప్రయోజనం ఉండదని కొరటాలకు సంకేతాలు వస్తున్నట్లు టాక్. దీనితో తన ‘ఆచార్య’ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక కొరటాల శివ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈమూవీని జనవరి 26న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కొరటాల కు వస్తున్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీ పడలేక సంక్రాంతి రేస్ నుండి తప్పుకునే మహేష్ పవన్ సినిమాలలో ఎదో ఒకటి రిపబ్లిక్ డేకు ఉంటుంది అన్న వార్తలు వస్తూ ఉండటంతో ప్రస్తుతానికి ‘ఆచార్య’ రిలీజ్ కు సంబంధించిన దార్లు అన్నీ మూసుకు పోయాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా అనేక భారీ సినిమాలు తమ సినిమాల రిలీజ్ కు సంబంధించి వచ్చే ఏడాది మార్చి ఏప్రియల్ నెలలను కూడ ముందుగా రిజర్వ్ చేసుకుంటూ ఉండటం ‘ఆచార్య’ టీమ్ కు షాక్ ఇస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: