తెలుగులో ఏ పాత్రని అయిన గొప్పగా నటించే నటులలో కోట శ్రీనివాస్ రావు గారు ఒకరు. ఆయన పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించగలడు , కమెడియన్ కూడా తన ప్రతిభ చూపించగలడు. దాదాపుగా 40 ఏళ్ల ఆయన సినిమా ప్రస్థానంలో కోట శ్రీనివాస్ రావు గారు తెలుగు తమిళం , హిందీ భాషల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించారు. ఇక ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ లలో ఆహ నా పెళ్ళంటా సినిమా మొదటగా ఉంటుంది. ఈ సినిమాలో ఆయనని సహాయ నటుడు అనడం కన్నా రెండో హీరో అంటే బాగుంటుందేమో.

పిసినారి గా ఆయన నటన నిజంగా అద్భుతం అని చెప్పాలి. జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయనకి తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఆయన కామెడీ చేయడంలోనే కాకుండా విలనిజం పండించడంలోను పెద్ద దిట్ఠ. ఆయన త్రివిక్రమ్ సినిమాల్లో మెయిన్ విలన్ కన్నా ఎక్కువగా పెరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతడు సినిమాలో కోట గారి పాత్ర సినిమా అంతా కలిపి ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలోనే ఆయన తన మార్కు ని చూపించాడు. ముఖ్యంగా మహేష్ బాబు తో ఫోన్ మాట్లాడే సీన్ ఇప్పటికి చాలా ఫేమస్. అలాగే అదే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులై సినిమాలో కోట గారి పాత్రకి మంచి పెరు వచ్చింది.

సినిమాలో బెస్ట్ డైలాగ్స్ అంత ఆయన నోటినుంచే వచ్చాయి. వార్నింగ్ ఇవ్వడంలో కూడా కోట గారు కామెడీని పండించారు. తెలుగులో చాలామంది గొప్ప నటులు ఉన్నప్పటికీ మనవాళ్ళు హిందీ నటులని ఎందుకు తెచుకుంటున్నారు అనేది కోట గారి బాధ. ఈ విషయాన్ని కూడా ఆయన చాలాసార్లు స్టేజి మీద కూడా బయటపెట్టారు. చాలాసార్లు పరభాషా నటులని సినిమా షూటింగ్స్ లలో కూడా తిట్టారు అనే వార్తలు కూడా కోట గారిమిద ఉన్నాయి. వీటి అన్నిటికి కారణం మాత్రం ఆయనకి తెలుగు జాతి మీద ఉన్న ప్రేమ .

మరింత సమాచారం తెలుసుకోండి: