పవర్ఫుల్ పోలీస్ కథనాలతో తెరకెక్కిన చిత్రాలన్నీ దాదాపుగా పెద్ద సక్సెస్ ను అందుకుంటాయని తెలుగు చిత్ర సీమలో ఒక సెంటిమెంట్ వుంది. అదే తరహాలో వెండి తెరపై మెరిసిన చిత్రం టెంపర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేయగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేశారు. రొటీన్ స్టోరీని కొత్త తరహాలో తెరపై చూపించి తన డైరెక్షన్ మార్క్ ను కనబరచారు దర్శకుడు పూరి జగన్నాథ్. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ లో ఒక మైలు రాయిగా మారింది. స్టోరీ లైన్, పాత్రలు, ఎమోషన్స్, ఎక్సప్రెషన్స్ పాటలు ఇలా ఈ చిత్రంలో ప్రతి ఒక్కటి అచ్చొచ్చాయని చెప్పాలి. ఈ మూవీలో హీరో తారక్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఆ తరవాత క్రెడిట్ నటుడు పోసాని కృష్ణ మురళికే ఎక్కువగా దక్కింది.

రాజా అన్న ఊత పదంతో ప్రేక్షకులను ఓ ఊపు తెప్పించే పోసాని ఈ సినిమాలోనూ తన మ్యాజిక్ కనబరిచాడు. నిజానికి ఈ చిత్రంలో పోసాని నటన అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఆయన డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్.. సినిమాకి మరింత హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో అటు ఎన్టీఆర్ ఇరగదీయగా ఇటు పోసాని యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. అందులో ఈ మూవీలో పోసాని కృష్ణ మురళి ది ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ కావడంతో ప్రేక్షకులు ఈయన యాక్టింగ్ ని మరింత ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏ సీన్ కూడా అస్సలు బోర్ అనిపించలేదు.. పోసాని డైలాగ్స్ కూడా మరీ పవర్ఫుల్ గా ఉన్నా ఆ పాత్రకు ఖచ్చితంగా ఆ రేంజ్ లో అవసరం అనిపించాయి. సిన్సియర్ కానిస్టేబుల్ గా వృత్తికి గౌరవం ఇస్తూ సత్యాన్ని నమ్మిన వ్యక్తిగా పోసాని క్యారెక్టరైజేషన్ సూపర్ గా సింక్ అయింది.

ఇక్కడ మరో స్పెషాలిటీ ఏమిటంటే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అనగానే రాజా అనే మాడ్యూలేషన్ అందరికీ అలవాటు అయిపోయింది. కానీ ఈ చిత్రంలో ఆ రాజా అనే మాటే వినిపించలేదు. అయినా ఆయన డైలాగ్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని మెప్పించాయి. టెంపర్ సినిమా గురించి గుర్తువస్తే హీరో తర్వాత అందరికీ జ్ఞాపకం వచ్చేది పోసాని కృష్ణ మురళి నే. ముఖ్యంగా మీరు మారిపోయారు సార్ ...మీరు మారిపోయారు అండి అనే పోసాని డైలాగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. పోలీస్ స్టేషన్ లో సీడీ కోసం వచ్చిన రౌడీలను ఇరగదీస్తాప్పుడు పోసాని చేసే సెల్యూట్ తో ఒక్కసారిగా థియేటర్ అంత దద్దరిల్లిపోయింది. ఇలా ఆ సినిమా ఘన విజయానికి పోసాని కృష్ణ మురళి పాత్ర దారుడాయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: