క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా కొండపొలం. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర విశేషాల గురించి ప్రతి ఒక్కరు వెల్లడించారు. అంతే కాదు డైరెక్టర్ కూడా ఈ చిత్రంలోని కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని వెల్లడించి సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. ఇక విడుదలకు మూడు రోజుల సమయమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా క్రిష్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన బిహైండ్ సీన్స్ ను వెల్లడించి ప్రేక్షకులను ఆసక్తి పరిచారు.

కరోనా సమయంలో ఒకసారి దర్శకులందరూ కలిసినప్పుడు కొండ పొలం నవల గురించి ఇంద్రగంటి మోహన కృష్ణ మరియు సుకుమార్ చెప్పడంతో ఆ పుస్తకాన్ని చదివాను. అది నాకు చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను అని దర్శకుడు క్రిష్ తెలిపాడు. ఎన్నో పుస్తకాలు కూడా చదివాను ఇందులో కొండపొలం బాగా నచ్చడంతో ఆ నవల రచయిత సన్నపురెడ్డి ని కలిసి హక్కులు తీసుకున్నాం. సుకుమార్ కూడా అడగడంతో నేను తీసుకున్నాను అని చెప్పడంతో సుకుమార్ ఈ సినిమాను చేయాలనుకుని మానేశారు.

ఆ విధంగా అలాంటి ఓ అద్భుతమైన కథ సినిమా  చేసినందుకు గర్వపడుతున్నాను అన్నారు.  ఇక ఈ సినిమాలో ఓబులమ్మ పాత్ర గురించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి పుస్తకంలో హీరోయిన్ పాత్ర లేదని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాలో మేము ఈ పాత్రను సృష్టించామని చెప్పారు.  అంతే కాకుండా ఈ సినిమాలో ఓబులమ్మ గా రకుల్ నే ఎందుకు తీసుకున్నారని అడగగా ఆమె అయితే బాగా సరిపోతుందని, కెమెరామెన్ కూడా ఆమెనే చెప్పడంతో ఆమెను ఎంచుకున్నానని క్రిష్ తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే గతంలో గ్లామర్ పాత్రలు చేసినా కూడా ఈ పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించింది రకుల్ అని ఆయన అన్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న వైష్ణవ్ త్తేజ్ ఇప్పుడు ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: